Ram Charan: దక్షిణాదిలో ఆ రికార్డు ఒక్క రామ్ చరణ్‌కు మాధ్యమే సాధ్యమైంది. వేరే హీరోలెవరికి అది సాధ్యం కాలేదు. వివరాల్లోకి వెళితే.. మెగా పవరర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఏర్పిడిన గ్యాప్‌ను వరుస సినిమాలు చేయడం ద్వారా పూరించాలనే డిసిషన్ తీసుకున్నాడు. ఐతే.. ఆర్ఆర్ఆర్ కంటే ముందు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తోన్న ‘ఆచార్య’తో మే 13న ప్రేక్షకులను పలకరించనున్నాడు. అంతేకాదు ఇదే యేడాది అక్టోబర్ 13న రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) సినిమా విడుదల కానుంది. ఒకే కాలండర్ ఇయర్లో రామ్ చరణ్ నటిస్తోన్న రెండు సినిమాలు విడుదల కావడం ఇదే మొదటిసారి.
ముందుగా రామ్ చరణ్ .. కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి చిరంజీవితో కలిసి ’ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. ఆచార్యలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్లో ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ .. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఈ సినిమాను శంకర్ సరికొత్త కాన్సెప్ట్‌తో తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
రాజమౌళి,రామ్ చరణ్,శంకర్ (File/Photos)
ఈ సినిమాను శంకర్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పోటీ ఇచ్చే విలన్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నట్టు సమాచారం. ఐతే.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో శంకర్ దర్శకత్వంలో నటించిన హీరోలెవరు రాజమౌళి దర్శకత్వంలో యాక్ట్ చేయలేదు. కానీ రామ్ చరణ్ మాత్రం.. ఇటు రాజమౌళి దర్శకత్వం పాటు శంకర్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ రకంగా రాజమౌళి డైరెక్షన్‌తో పాటు శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న తొలి హీరోగా రామ్ చరణ్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి. మిగతా ఏ దక్షిణాది హీరోలకు దక్కని ఆ అవకాశం మొదటిసారి రామ్ చరణ్‌కు మాత్రమే దక్కిందని చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.