RAM CHARAN IMPRESSED ANIL RAVIPUDI STORY HERE ARE THE DETAILS TA
అనిల్ రావిపూడి కథకు రామ్ చరణ్ ఫిదా.. సెట్స్ పైకి వెళ్లేది ఎపుడంటే..
అనిల్ రావిపూడి, రామ్ చరణ్ (Instagram/Ram Charan)
తెలుగులో రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడి విషయానికొస్తే.. తను ఏ సినిమా చేసినా.. అందులో తనదైన కామెడీతో తెరకెక్కించడం అనిల్ రావిపూడి స్టైల్. తాజాగా ఈయన రామ్ చరణ్‌కు ఒక స్టోరీ లైన్ వినిపించినట్టు సమాచారం.
తెలుగులో రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయం అంటూ ఎరగని దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడి విషయానికొస్తే.. తను ఏ సినిమా చేసినా.. అందులో తనదైన కామెడీతో తెరకెక్కించడం అనిల్ రావిపూడి స్టైల్. కళ్యాణ్ రామ్‌తో ‘పటాస్’ నుంచి మొదలు పెడితే.. ఆ తర్వాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వరుసగా ఐదు హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు తనదైన కామెడీ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ సినిమాను సక్సెస్ చేసాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి.. వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజలతో ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే కనీసం దసరా వరకు ఆగాల్సిందే. ఇప్పటికే వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీటైన తర్వాత కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లదు. ఆ తర్వాత మరోసారి మహేష్ బాబుతో మరో సినిమా చేయడానికి కమిటయ్యాడు. కానీ ఈ చిత్రం వచ్చే యేడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. తాజాగా ఈ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించినట్టు సమాచారం. ఈ కథ విని.. చరణ్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడట. వెంటనే ఈ స్టోరీలైన్‌ను డెవలప్ చేయమని చెప్పాడట.
రామ్ చరణ్,అనిల్ రావిపూడి (Twitter/Photo)
ప్రస్తుతం రామ్ చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత హీరోగా రామ్ చరణ్ మరో లెవల్లోకి వెళ్లడం ఖాయం. అందుకే ‘RRR’ వంటి మాస్ ఓరియంటెడ్ కథ తర్వాత ఒక కామెడీ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే అనిల్ రావిపూడితో కథను జూన్ లోపల రెడీ చేసుకోమని చెప్పాడట. వీలైతే.. ఆర్ఆర్ఆర్ తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు యేడాదిన్నరకు పైగా టైమ్ కేటాయించిన రామ్ చరణ్.. వెంట వెంటనే కథలను విని సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా, అట్లీ, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి దర్శకులు కూడా రామ్ చరణ్ కోసం కథలను రెడీ చేసి పెట్టారట.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.