RAM CHARAN GOING TO ACT IN A PAN INDIAN MOVIE UNDER SENSATIONAL DIRECTOR SHANKAR PRODUCED BY DIL RAJU PK
Ram Charan - Shankar - Dil Raju: చిరంజీవి చేయలేకపోయాడు.. శంకర్‌తో చరణ్ చేస్తున్నాడిప్పుడు..
రామ్ చరణ్ శంకర్ (Ram Charan Shankar)
Ram Charan - Shankar - Dil Raju: చిరంజీవికి ఎన్నో ఏళ్ళ నుంచి ఓ కల ఉండేది. అదే శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా నటించాలని. రోబో సినిమా సమయంలో చెప్పాడు కూడా. తనకు శంకర్ లాంటి దర్శకుడితో పని చేయాలని ఉందని.
చిరంజీవికి ఎన్నో ఏళ్ళ నుంచి ఓ కల ఉండేది. అదే శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా నటించాలని. రోబో సినిమా సమయంలో చెప్పాడు కూడా. తనకు శంకర్ లాంటి దర్శకుడితో పని చేయాలని ఉందని. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. పైగా శంకర్ కూడా ఎప్పుడూ తెలుగు ఇండస్ట్రీకి రాలేదు. కానీ ఇన్నేళ్ళకు ఆ అవకాశం వచ్చింది. అయితే తండ్రికి ఛాన్స్ దక్కకపోయినా కూడా తనయుడికి మాత్రం శంకర్‌తో సినిమా చేసే ఆఫర్ వచ్చేసింది. రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియన్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు శంకర్. ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. సెన్సేషనల్ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. అంతేకాదు తన నిర్మాణంలో రాబోయే 50వ సినిమా కావడం విశేషం. నాలుగేళ్ళ కింద అల్లు అర్జున్ డిజే సినిమాతో 25 సినిమాల మైలురాయి అందుకున్నాడు దిల్ రాజు. ఈ నాలుగేళ్ళలోనే మరో 24 సినిమాలు పూర్తి చేసాడు. ఇప్పుడు 50వ సినిమా వైపు వస్తున్నాడు. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ కూడా ఇప్పుడు భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. కమల్ హాసన్ హీరోగా దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 25 ఏళ్ళ కింద వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ కథను సిద్ధం చేసుకున్నాడు దర్శకుడు శంకర్. ఇండియన్ 2 తర్వాత రామ్ చరణ్ సినిమా ఉండబోతుంది. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. గతంలో తెలుగు ఇండస్ట్రీకి రావడానికి శంకర్ ప్రయత్నించాడు.
Excited to be a part of Shankar Sir's cinematic brilliance produced by Raju garu and Shirish garu.
ఆ మధ్య స్నేహితుడు సినిమాను తెలుగులో మహేష్ బాబు హీరోగా రీమేక్ చేయాలనుకున్నాడు కానీ ఆయన చేయనని చెప్పేసాడు. మరోవైపు ఈయన తొలి సినిమా జెంటిల్ మెన్ కథను ముందు రాజశేఖర్‌కు చెప్పినా వర్కవుట్ కాలేదు. అలా అర్జున్ వచ్చేసాడు. అక్కడ్నుంచి శంకర్ వెనుదిరిగి చూసుకోలేదు. అప్పట్నుంచి పూర్తిగా తమిళ ఇండస్ట్రీకే పరిమితం అయిపోయాడు శంకర్. కొన్నేళ్లుగా సరైన విజయం కోసం చూస్తున్న శంకర్.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాను కన్ఫర్మ్ చేసాడు.
రామ్ చరణ్ శంకర్ (Ram Charan Shankar)
నిజానికి భారతీయుడు 2 సినిమాను దిల్ రాజు నిర్మించాలి. అయితే ఆ సినిమా నుంచి అనుకోని కారణాలతో దిల్ రాజు తప్పుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు సెట్ అయ్యాడు. ఈ సినిమాను దాదాపు 200 కోట్లతో నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య టెక్నికల్ సినిమాల వైపు వెళ్లిన శంకర్.. రామ్ చరణ్‌తో మాత్రం సందేశాత్మక కథనే తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. శివాజీ తర్వాత శంకర్ నుంచి అలాంటి సినిమా రాలేదు. ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాల తర్వాత శంకర్ కాంబినేషన్ సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే స్టోరీ నెరేషన్ జరిగిపోయింది. ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలోనే ఉండబోతుంది. మరి చూడాలిక.. రామ్ చరణ్‌తో శంకర్ ఎలాంటి సబ్జెక్ట్ తీసుకురాబోతున్నాడో..?
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.