Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: December 23, 2019, 9:10 AM IST
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ (Source: Twitter)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు మంచి అనుబంధమే ఉంది. వీళ్లిద్దరు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఇండస్ట్రీలో నందమూరి, కొణిదెల వంటి రెండు పెద్ద ఫ్యామిలీలకు చెందిన ఈ ఇద్దరి మధ్య స్నేహం అభిమానుల మధ్య ఆరోగ్యకర వాతావారణాన్ని సృష్టించింది. ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్..కొమరం భీమ్ పాత్రలో నటిస్తే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులు కలిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరగుతోంది. ఫిబ్రవరి మొదటివారానికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత జక్కన్న తన దృష్టిని ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పై కేంద్రీకరించనున్నాడు. తాజాగా రామ్ చరణ్.. ఎన్టీఆర్‌కు ఒక అద్భుతమైన సలహా ఇచ్చినట్టు దాన్ని ఎన్టీఆర్ ఆచరణలో పెట్టబోతున్నట్టు సమాచారం.

RRR సినిమా పోస్టర్ (Source: Twitter)
ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు ఒక వైపు హీరోగా నటిస్తూనే నిర్మాతలుగా రాణిస్తున్నారు. రామ్ చరణ్, నాగార్జున, బాలకృష్ణ,కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ ఒకవైపు హీరోగా..మరోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కూడా తనకంటూ ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే అన్నయ్య కళ్యాణ్ రామ్‌కు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఉంది. మరోవైపు బాబాయి బాలయ్యకు ఎన్బీకే ఫిల్మ్స్ ఉంది. అదే కోవలో ఎన్టీఆర్ కూడా తన తండ్రి కొడుకు పేర్లు కలిసేచ్చేలా ‘భార్గవ్ హరి ప్రొడక్షన్స్’ హౌస్ స్థాపించిబోతున్నట్టు తారక్ సన్నిహిత వర్గాలు చెబుతన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తన సొంత ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 23, 2019, 9:07 AM IST