సాధారణంగా అన్నయ్య దారిలో తమ్ముళ్లు నడుస్తుంటారు.. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం. తమ్ముడి దారిలో అన్నయ్య వెళ్తున్నాడు. మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇప్పుడు ఇదే చేస్తున్నారు. అప్పుడు వరుణ్ నడిచిన దారిలోనే ఇప్పుడు చరణ్ కూడా వెళ్తున్నాడు.
సాధారణంగా అన్నయ్య దారిలో తమ్ముళ్లు నడుస్తుంటారు.. కానీ ఇక్కడ మాత్రం విచిత్రం. తమ్ముడి దారిలో అన్నయ్య వెళ్తున్నాడు. మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇప్పుడు ఇదే చేస్తున్నారు. అప్పుడు వరుణ్ నడిచిన దారిలోనే ఇప్పుడు చరణ్ కూడా వెళ్తున్నాడు. నిజం ఒప్పుకోడానికి చాలా ధైర్యం కావాలి.. అందరిముందు ఓటమి ఒప్పుకోవాలంటే కొండంత ధైర్యం ఉండాలి.. చరణ్ అది చేసి చూపించాడు. తనకు ఆ ధైర్యం ఉందని నిరూపించాడు. ‘వినయ విధేయ రామ’ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఓపెన్ లెటర్ రాసి అందరి మనసులు గెలుచుకున్నాడు చరణ్.
వినయ విధేయ రామ
అయితే ఇదే పని రెండు నెలల కింద వరుణ్ తేజ్ కూడా చేసి ఔరా అనిపించాడు. అప్పట్లో అంతరిక్షం సినిమా అనుకున్న ఫలితం సాధించకపోవడంతో వెంటనే బయటికి వచ్చి తను అంచనాలు అందుకోలేకపోయాను సారీ అని చెప్పాడు మెగా వారసుడు. నిజానికి అలా చెప్పడం చిన్న విషయం కాదు. ఫ్లాప్ సినిమాలను కూడా హిట్.. సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న రోజులివి.
అంతరిక్షం 9000 kmph
కొందరు హీరోలకైతే వాళ్లు నటించిన సినిమాలు డిజాస్టర్స్ అయినా కూడా ఫ్లాప్ అంటే ఒప్పుకోరు. ఇలాంటి సమయంలో చరణ్, వరుణ్ లాంటి హీరోలు బయటికి వచ్చి తాము ఫ్లాప్ సినిమాలు ఇచ్చాం.. క్షమించండంటూ అభిమానులను కోరడం చిన్న విషయం కాదు. మరి చూడాలిక.. ఇదే సంప్రదాయాన్ని మిగిలిన హీరోలు కూడా ఫాలో అవుతారో లేదో..?
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.