Ram Charan: ఫిట్‌నెస్ కోసం రామ్ చరణ్ పడుతున్న తంటాలు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అంతేకాదు తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా తాను వ్యాయామం చేస్తోన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

news18-telugu
Updated: July 10, 2020, 12:21 PM IST
Ram Charan: ఫిట్‌నెస్ కోసం రామ్ చరణ్ పడుతున్న తంటాలు..
రామ్ చరణ్ (Twitter/Photo)
  • Share this:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అంతేకాదు తనకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే తనకు సంబంధించిన పాత ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇచ్చినా.. కరోనా భయం కారణంగా ఇంకో నాలుగైదు నెలలు వరకు రామ్ చరణ్ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రామ్ చరణ్.. ఇంట్లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసాడు. ఇందులో ఆ బాధను వెల్లగక్కాడు. మనసు మాత్రం వర్కౌట్స్ చేయమని చెప్పినా.. బుద్ధి మాత్రం వద్దని చెబుతుంది. అయినా ఫిట్‌నెస్‌గా ఉండాలంటే ఆ మాత్రం కష్టపడాలిగా అంటూ తన వర్కౌట్స్ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.


ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’  సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లో అంచనాలున్నాయి. ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 10, 2020, 12:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading