news18-telugu
Updated: October 27, 2019, 12:48 PM IST
ఈ సినిమా కోసం 20 రోజుల డేట్స్ ఇచ్చాడు చరణ్. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. మరోవైపు RRR తర్వాత చరణ్ ఆచార్యపై ఫోకస్ చేయబోతున్నాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తూనే.. నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. ఇప్పటికే తన ఓన్ బ్యానర్లో తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలు తెరకెక్కించాడు. ఇక సైరా విషయానికొస్తే.. చిరంజీవి తన సినీ కెరీర్లోనే ఫస్ట్ టైమ్ ఒక చారిత్రక పాత్రను పోషించాడు. ఈ సినిమా కలెక్షన్స్ విషయమై తాజాగా రామ్ చరణ్ స్పందించాడు. ముఖ్యంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయం తాను కూడా తెలుసుకోలేదని చెప్పాడు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెలుగులో రంగస్థలం కలెక్షన్స్‌ను దాటి.. ‘బాహుబలి’ కి దగ్గరగా వచ్చిందన్నారు.

‘సైరా’ షూటింగ్ స్పాట్లో రామ్ చరణ్,చిరంజీవి ( Twitter/Photo)
ఇక ‘సైరా నరసింహారెడ్డి’ క్లైమాక్స్ తీసే సమయంలో తాను లేన్నారు. తరువాత వాటిని చూసి తనకు కన్నీరు ఆగలేదన్నాడు. ఈ సీన్లను ఎలా తీయాలా ? అని రెండు నెలలు ఆలోచించానన్నారు. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీసిన తర్వాత 30 ఏళ్ల పాటు ఆ తలను కోట గుమ్మానికి వేలాడదీశారని దాన్ని అలాగే చూపించాలా ? వద్దా ? అని ఎంతో ఆలోచించి కొంచెం క్రియేటివి జోడించి ఈ సీన్‌ను తీసేటట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు తాను నిర్మాతగా మారాలని అనుకోలేదు. కేవలం నాన్న చిరంజీవి ఆలోచనల నుంచే కొణిదెల ప్రొడక్షన్స్ పురుడుపోసుకుందని చెప్పుకొచ్చాడు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 27, 2019, 12:48 PM IST