ఫోటో టాక్.. చిరుతతో ఆ రోజుల్లో చిందేయిస్తున్న లారెన్స్..

Ram Charan Chirutha: అది 2006 ఆగస్ట్ 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఆ రోజే తన వారసుడు రామ్ చరణ్‌ను కూడా అభిమానులకు పరిచయం చేసాడు అన్నయ్య.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2020, 8:55 PM IST
ఫోటో టాక్.. చిరుతతో ఆ రోజుల్లో చిందేయిస్తున్న లారెన్స్..
చిరుత సెట్‌లో రామ్ చరణ్‌కు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న లారెన్స్ (lawrence ram charan at chirutha time)
  • Share this:
అది 2006 ఆగస్ట్ 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఆ రోజే తన వారసుడు రామ్ చరణ్‌ను కూడా అభిమానులకు పరిచయం చేసాడు అన్నయ్య. నాకు ఇచ్చినట్లే నా వారసుడికి కూడా మీరే అండదండ అంటూ దండం పెట్టేసాడు. ఆ వెంటనే రామ్ చరణ్‌ను పరిచయం చేయడానికి సరైన దర్శకుడు ఎవరంటే పూరీ పేరు చిరుకు తోచింది. ఆ వెంటనే తన వారసున్ని ఆయన చేతుల్లో పెట్టడం.. ఆయన రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేయడం.. సినిమా విడుదల చేయడం జరిగిపోయింది. అదే చిరుత.. ఈ సినిమా గురించి మెగా వారసులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

రామ్ చరణ్ చిరుత సెట్‌లో బన్నీ (ram charan puri allu arjun)
రామ్ చరణ్ చిరుత సెట్‌లో బన్నీ (ram charan puri allu arjun)


బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా బాగానే రచ్చ చేసింది. అప్పట్లోనే దాదాపు 19 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసింది. అశ్వినీ దత్ తెరకెక్కించిన చిరుత ఓపెనింగ్స్‌లో దుమ్ము దులిపేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ముందు వరకు కూడా అసలు రామ్ చరణ్‌కు డాన్సులు వస్తాయా రావా అనే డౌట్ మెగా కుటుంబంలో కూడా ఉండేది. అన్నిచోట్లా బన్నీ ఒక్కడే డాన్స్ చేసేవాడు.. దాంతో చరణ్‌కు డాన్స్ వచ్చా రాదా అనేది అనుమానం. అలాంటి సమయంలో చిరుత సినిమాలోని తొలి పాట ఓసోసి రాకాసి పాట చూసి అంతా ఫిదా అయిపోయారు.

రామ్ చరణ్ (Ram Charan old photo)
రామ్ చరణ్ (Ram Charan old photo)


చిరంజీవి కూడా ఈ పాట చూసిన తర్వాత అసలు చరణ్ ఇంత బాగా డాన్స్ చేస్తాడా అని ఆశ్చర్యపోయాడు. ఇదే విషయాన్ని అప్పట్లో చెప్పాడు కూడా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటో అప్పట్లో చరణ్‌కు లారెన్స్ స్టెప్పులు నేర్పిస్తున్న సమయంలోదే. చిరుతలో ఓసోసి రాకాసి పాట లారెన్స్ కంపోజ్ చేసాడు. అందులో డాన్స్ దుమ్ము దులిపేసాడు చరణ్. దాంతో పాటు మిగిలిన పాటలు కూడా కుమ్మేసాడు. మొత్తానికి ఇప్పుడు ఇండియన్ సినిమాలోనే బెస్ట్ డాన్సర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా వారసుడు.
Published by: Praveen Kumar Vadla
First published: April 11, 2020, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading