రామ్ చరణ్ కోసం ప్రొఫెషనల్ బాక్సర్.. RRR ధ్యాసలో..

Ram Charan: రామ్ చరణ్ లాక్‌డౌన్ పీరియడ్‌ను పూర్తిగా యూజ్ చేసుకుంటున్నాడు. ఈయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 4, 2020, 5:21 PM IST
రామ్ చరణ్ కోసం ప్రొఫెషనల్ బాక్సర్.. RRR ధ్యాసలో..
ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ లుక్ (rrr ram charan)
  • Share this:
రామ్ చరణ్ లాక్‌డౌన్ పీరియడ్‌ను పూర్తిగా యూజ్ చేసుకుంటున్నాడు. ఈయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా ప్రభావంతో వాయిదా పడింది. దాంతో ఎవరికి వాళ్లు ఇంటికే పరిమితం అయిపోయారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ సమయంలో సమయం వృథా చేయడం కంటే కూడా ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసాడు రామ్ చరణ్. అందులో భాగంగానే మరింత మేకోవర్ అవుతున్నాడు.

రామ్ చరణ్ బాక్సింగ్ (ram charan boxing)
రామ్ చరణ్ బాక్సింగ్ (ram charan boxing)


దీనికోసమే చరణ్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు. నీరజ్ గోయంక్ అనే ప్రొఫెషనల్ బాక్సర్‌ను నియమించుకున్నాడు రామ్ చరణ్‌. ఈయన ఆధ్వర్యంలోనే చరణ్ వర్కవుట్స్ కూడా చేస్తున్నాడు. RRR టీజర్‌లో కూడా బాక్సింగ్ చేస్తూ కనిపించాడు చరణ్. ఇక ఇప్పుడు తనతో రామ్ చరణ్ ఉన్న ఫోటోను షేర్ చేసాడు గోయంక్. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది. RRR తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చరణ్ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. దాంతో పాటే ఆచార్యలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్.
First published: May 4, 2020, 5:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading