సైరా టీమ్ తరుపున అనుష్కకు స్పెషల్ థాంక్స్ చెప్పిన చరణ్..

చిరంజీవి,అనుష్క శెట్టి (ఫైల్ ఫోటోస్)

చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా రామ్ చరణ్.. ఈ సినిమాలో అనుష్క పవర్ఫుల్ పాత్ర చేసినందుకు గాను స్పెషల్ థాంక్స్ చెప్పారు.

  • Share this:
    చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా అనుష్కకు థాంక్స్ చెప్పారు. ‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క కథకు కీలక మలుపు తిప్పే పాత్రలో నటించినట్టు సమాచారం. ఈ సినిమాలో అనుష్క.. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించినట్టు సమచారం.    అసలు ఝాన్సీ లక్ష్మీబాయికి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు అసలు సంబంధమే లేదు. కానీ..ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి ‘సైరా..నరసింహారెడ్డి’ కథను ఝాన్సీ లక్ష్మీబాయి కోణంలో చెబుతారట. గతంలో ‘రుద్రమదేవి’ సినిమాలో రుద్రమదేవిగా మెప్పించిన అనుష్క ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయి‌గా కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మించాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: