చిరంజీవి, రామ్ చరణ్ విడిపోయారా.. ఒకే ఇంట్లో ఉండట్లేదా..?

ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలు తమ తమ సొంత ఇళ్లలోకి మారిపోయారు. బన్నీ కూడా కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. రామ్ చరణ్ కూడా తన తండ్రి నుంచి దూరంగా ఉన్నాడని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 25, 2020, 8:43 PM IST
చిరంజీవి, రామ్ చరణ్ విడిపోయారా.. ఒకే ఇంట్లో ఉండట్లేదా..?
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
  • Share this:
అదేంటి.. ఉన్నట్లుండి ఈ అనుమానం ఇప్పుడెందుకు వచ్చింది..? అంతా కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు కదా.. మళ్లీ అప్పుడే ఇలా అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా..? ఏమో ఈ మధ్యే జరిగిన ఈ సీన్ చూసిన తర్వాత ఈ అనుమానం అందర్లోనూ వస్తుంది. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలు తమ తమ సొంత ఇళ్లలోకి మారిపోయారు. బన్నీ కూడా కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇన్ని రోజులు తల్లిదండ్రులతోనే ఉన్న ఈయన.. ఇప్పుడు మరో ఇంటికి వెళ్ళనున్నాడు. మనోజ్, విష్ణు లాంటి వాళ్లు ఎప్పుడో అది చేసారు. నాగ చైతన్య అయితే పెళ్లికి ముందు నుంచే ప్రత్యేకంగా ఇల్లు తీసుకున్నాడు.

భార్య, కొడుకు, కోడలితో చిరంజీవి (Twitter/Photo)
భార్య, కొడుకు, కోడలితో చిరంజీవి (Twitter/Photo)


ఇప్పుడు రామ్ చరణ్ కూడా తన తండ్రి నుంచి దూరంగా ఉన్నాడని తెలుస్తుంది. మొన్నటి వరకు అంతా కలిసే ఉన్నా కూడా కొన్ని రోజుల కింద ఉపాసన, చరణ్ దంపతులు మరో ఇంటికి మారిపోయారని ప్రచారం జరుగుతుంది. ఇందులో విడిపోవడం అనేది ఏం లేదని.. కొన్ని రోజులు ఇద్దరూ ఉండాలని అలా వెళ్లినట్లు తెలుస్తుంది. మొన్నటికి మొన్న జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా బయటికి వచ్చి చప్పట్లు కొట్టి తమ సంఘీభావం తెలపాలని మోదీ కోరినప్పుడు చిరు ఇంటి సభ్యులు కూడా బయటికి వచ్చారు.

చిరంజీవి కుటుంబం (chiranjeevi family)
చిరంజీవి కుటుంబం (chiranjeevi family)
అందులో రామ్ చరణ్ లేకపోవడం అభిమానులు కూడా గమనించారు. ఆయనతో పాటు చెల్లెళ్ళు, వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కానీ రామ్ చరణ్, ఉపాసన మిస్ అయ్యారు. అదే విధంగా రామ్ చరణ్ కూడా ఓ ఇంటి బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే చిరంజీవి పాత ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా రామ్ చరణ్ మార్చుకున్నాడు.

రామ్ చరణ్ ఉపాసన దంపతులు (ram charan upasana)
రామ్ చరణ్ ఉపాసన దంపతులు (ram charan upasana)


అలాంటప్పుడు ఆయన దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మొన్న చప్పట్లు కొట్టినపుడు కూడా చరణ్ ఒక్కడే కనిపించాడు. ఈ లెక్కన తండ్రి చిరు కుటుంబంతో కలిసి ఉపాసన, చరణ్ లేరని తెలుస్తుంది. దూరంగా ఉన్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తన తండ్రి దగ్గరికి చరణ్ వెళ్తుంటాడంటున్నారు సన్నిహితులు. మొత్తానికి ఏదేమైనా కూడా ఇద్దరూ సమీపంలోనే ఉన్నారని తెలుస్తుంది.
First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు