హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan: రామ్ చరణ్ మంచి మనసు.. డ్రైవర్‌ కోసం సడన్ సర్‌ప్రైజ్..!

Ram Charan: రామ్ చరణ్ మంచి మనసు.. డ్రైవర్‌ కోసం సడన్ సర్‌ప్రైజ్..!

డ్రైవర్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన రామ్ చరణ్

డ్రైవర్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన రామ్ చరణ్

రామ్ చరణ్ తన డ్రైవర్‌కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. తనదగ్గర పనిచేస్తున్న డ్రైవర్ బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ నిర్వహించాడు. ఈ వేడుకల్లో ఉపాసన కూడా పాల్గొంది.

  మెగా పవర్ స్టార్ రాం చరణ్ (Ram Charan)  గురించి తెలిసింది. మెగా ఇంటి వారసుడైనా.. చాలా సింపుల్‌గా ఉంటాడు.  తన కోస్టార్లతో పాటు.. అందరితో  చాలా క్లోజ్‌గా ఉంటాడు. ఈ క్రమంలో మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు రామ్ చరణ్. తన దగ్గర పనిచేసే వారిని సొంత మనుషుల్లా చూసుకోవడం లో మన స్టార్స్ ఎప్పుడూ ముందుంటారు . ఈ క్రమంలో రాం చరణ్ తన డ్రైవర్ బర్త్ డే రోజున అతనికి తెలియకుండా కేక్ కట్ చేయించి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

  ఎప్పుడూ ఉండే తమతో పాటు ఉండే తమ స్టాఫ్ కోసం స్టార్స్ తమ కొద్దిపాటి టైం కేటాయిస్తుంటారు. రాం చరణ్ (Ram Charan) దగ్గర డ్రైవర్ గా చేస్తున్న నరేష్ బర్త్ డే సందర్భంగా అతనికి తెలియకుండా కేక్ కటింగ్ ప్రొగ్రాం ఏర్పాటు చేశారట. తన మిగతా స్టాఫ్ తో కలిసి రామ్ చరణ్ దగ్గరుండి మరి కేక్ కట్ చేయించాడు. ఈ సెలబ్రేషన్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన(Upasana) కూడా పాల్గొంది.

  డ్రైవర్ నరేష్ చరణ్ దగ్గర కొన్నేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న నరేష్ కి జీతంగా రూ. 45 వేల రూపాయలు ఇస్తున్నారని సమాచారం. తమ స్టాఫ్ ని కూడా తమ సొంత కుటుంబంలా చూసుకుంటూ వారికి ఇలాంటి సర్ ప్రైజ్ లతో మరింత దగ్గరవుతున్నారు స్టార్స్. ముఖ్యంగా తన స్టాఫ్ విషయంలో రాం చరణ్ ఎప్పుడూ కేర్ ఫుల్ గా ఉంటారని.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని తెలుస్తుంది. తన డ్రైవర్ పుట్టినరోజు వేడుకల్లో సతీసమేతంగా చరణ్ పాల్గొనడం విశేషం. ఇక రామ్ చరణ్ చేసిన పనికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పనిచేసేవాళ్లను కూడా ఫ్యామిలీగా ట్రీట్ చేస్తాడంటూ చరణ్‌పై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

  మరోవైపు  RRR సినిమాలో మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేసిన రామ్ చ‌ర‌ణ్ .. ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శంక‌ర్ సినిమాను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్(Director Shankar) దర్శకత్వంలో RC15 చేస్తున్నాడు. అయితే ఈ  ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, రామ్ చరణ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభించనున్నాడు. ‘జెర్సీ'(తెలుగు) విజయంతో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్.. రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Mega power star ram charan, Ram Charan, Upasana konidela

  ఉత్తమ కథలు