Home /News /movies /

RAM CHARAN CELEBRATED HIS BIRTHDAY WITH HIS FRIEND JR NTR AND RAJAMOULI SON KARTHIKEYA FAMILIES PK

Ram Charan Birthday Celebrations: ఎన్టీఆర్, కార్తికేయ కుటుంబాలతో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్..

రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (jr ntr ram charan)

రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (jr ntr ram charan)

Ram Charan Birthday Celebrations: RRR సినిమాతో మరోసారి దుమ్ము దులిపేస్తున్నాడు రాజమౌళి (Rajamouli). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం వైపు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే 202 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇంకా చదవండి ...
Ram Charan Birthday Celebrations: RRR సినిమాతో మరోసారి దుమ్ము దులిపేస్తున్నాడు రాజమౌళి (Rajamouli). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం వైపు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే 202 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇండియాలోనే 150 కోట్లు షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లోనూ దుమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం. ఇదిలా ఉంటే ఈ సారి రామ్ చరణ్‌కు రెండు రోజుల ముందే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ రూపంలో ఈయన ఇచ్చిన బహుమతికి ఫిదా అయిపోతున్నాడు చరణ్. తాజాగా చరణ్ పుట్టిన రోజు వేడుకలు కూడా జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కుమారుడు కార్తికేయ కుటుంబాలతో జరిగాయి. మార్చ్ 27న ఈయన పుట్టిన రోజు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. ట్రిపుల్ ఆర్ కంటే ముందు నుంచే చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు.

ప్రతీ ఏడాది ఇద్దరూ కలిసి రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు జరుపుతారు. కొన్నేళ్లుగా ఇదే ఆనవాయితీగా వస్తుంది. ఎన్టీఆర్ భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చ్ 26.. ఆ రోజు భార్య బర్త్ డే సెలబ్రేట్ చేసి.. ఆ తర్వాత రోజు పూర్తిగా చరణ్‌తోనే ఉంటాడు తారక్. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. పైగా ఈ సారి ఇద్దరూ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల కావడం.. అది పెద్ద విజయం సాధించడంతో మరింత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ హీరోలు.

ఈ ఇద్దరితో రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా చేరిపోయాడు. ఆయన తన భార్య పూజా ప్రసాద్‌తో కలిసి వచ్చి చరణ్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసాడు. కొన్నేళ్లుగా ఈ ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ప్రముఖ దర్శకుడు శంకర్‌తో తన నెక్ట్ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు ప్రశాంత్ నీల్, గౌతమ్ తిన్ననూరి సినిమాలను కూడా కన్ఫర్మ్ చేసాడు చరణ్. వీటి షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ram Charan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు