Ram Charan : రామ్ చరణ్ కొత్త కారు అదిరింది.. రేటు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

రామ్ చరణ్ కొన్ని కొత్త కారు (Twitter/Photo)

Ram Charan : రామ్ చరణ్ కొత్త కారు అదిరింది.. రేటు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వివరాల్లోకి వెళితే. 

 • Share this:
  Ram Charan : రామ్ చరణ్ (Ram Charan) కొత్త కారు అదిరింది.. రేటు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వివరాల్లోకి వెళితే.. మన హీరోలకు కార్లంటే ఎంతో మోజు. అందుకే మార్కెట్‌లో కొత్త కారు ఏమైనా వచ్చిందంటే ముందుగా హీరోలే దాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇక తెలుగు హీరోల్లో చాలా మందికి కార్లంటే మక్కువ ఎక్కువ. కొత్తగా ఏదైనా మోడల్ కారు వచ్చిందంటే ఆయా హీరోల గ్యారేజ్‌లో ఉండాల్సిందే. రీసెంట్‌గా ఎన్టీఆర్ ‘లంబోర్ఘిని’ మోడల్ కారును ఆర్డర్ చేసారు. అంతేకాదు  మన దేశంలో ఈ కారును కొన్ని తొలి వ్యక్తిగా ఎన్టీఆర్ నిలిచారు. ఇలాంటి కొత్త కార్లు ఎన్టీఆర్ దగ్గర 20కి పైగా ఉన్నాయట.అదే కోవలో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ కూడా మరో కొత్త కారు కొన్నారు.

  ఈయన కొత్త న్యూ బ్రాండ్ బెంజ్ లగ్జరీ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేయించున్నారు. ఈ కారు మోడల్ పేరు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600. ఈ కారును కంపెనీ ప్రతినిధులు రామ్ చరణ్‌కు స్వయంగా అందజేసారు. ఆ తర్వాత రామ్ చరణ్.. తన టీమ్ మెంబర్స్‌తో కలిసి ఇంటికి వెళ్లారు.దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ కారును ఎ హై సెక్యూరిటీ ప్లస్ లేటెస్ట్ ఆటోమేటేడ్ టెక్నాలజీతో డిజైన్ చేసారు. ఈ కారు ధర రూ. 2.5 కోట్లు. ఇప్పటికే రామ్ చరణ్ దగ్గర ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ సహా పలు మోడల్ కార్లు ఉన్నాయి.  రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది విడుదల చేయనున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. మరోవైపు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.

  Hit Movie Remake Bollywood: అధికారికంగా ప్రారంభమైన ’హిట్’ హిందీ రీమేక్.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల హంగామా..

  ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ నుంచి పాలిటిక్స్‌లోకి  వచ్చి వ్యవస్థను చక్కదిద్దే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..


  అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: