Home /News /movies /

RAM CHARAN BOMMARILLU DIALOGUES AT ACHARYA PRE RELEASE EVENT SB

Acharya Pre Release Event: రాజమౌళిని ఉద్దేశిస్తూ బొమ్మరిల్లు డైలాగ్స్ చెప్పిన రామ్ చరణ్

ఆచార్య సినిమాలో రామ్ చరణ్

ఆచార్య సినిమాలో రామ్ చరణ్

రాజమౌళిని ఉద్దేశిస్తూ.. బొమ్మరిల్లు డైలాగ్స్ చెప్పాడు రామ్ చరణ్. 2006లో రిలీజ్ అయిన బొమ్మరిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

    మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. మెగా ఫ్యాన్స్ భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ... రాజమౌళిపై పలు  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్‌లో రెండు సినిమాలు చేశాడు. మగధీర తర్వాత ఆర్ఆర్ఆర్. అయితే రాజమౌళి సినిమా చేస్తే.. ఆయన దగ్గర మనం లాక్ అయిపోయినట్లే అన్నాడు చరణ్. తాను సినిమా చేస్తున్నంత కాలం... రాజమౌళి తన హీరోలను బయటకు వదలరన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సమయంలోనే.. తనకు ఆచార్యలో తండ్రి చిరంజీవి పక్కన నటించే అవకాశం వచ్చిందన్నారు. ఇది తన తల్లి కోరిక అని.. ఎలా అయిన ఆచార్య సినిమా కూడా చేయాలని అనుకున్నానన్నారు.

    అయితే రాజమౌళి గారిని ఒప్పించడం ఎలా అనే సందేహంలో పడిపోయానన్నారు. ఎందుకంటే బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్ధార్థ ‘నా చేయి ఇప్పటికీ మీ చేతుల్లోనే ఉండిపోయింది నాన్న’ అనే డైలాగ్ చెబుతూ.. ఆర్ఆర్ఆర్ చేస్తున్నంత కాలం తన చేయి కూడా రాజమౌళి చేతిలో లాక్ అయిపోయిందంటూ బొమ్మరిల్లు డైలాగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు రామ్ చరణ్. దీంతో ఈ విషయం కొరటాల శివ గారికి చెప్పడంతో ఆయన చిరంజీవి కలిసి... రాజమౌళి గారిని ఒప్పించారన్నారు. దీంతో రాజమౌళి గారు.. తనకు వీలు ఉన్నప్పుడు ఆచార్య సెట్‌కు రామ్ చరణ్‌ను పంపిస్తానని మాట ఇచ్చారన్నారు. అలా ఆర్ఆర్ఆర్ చేస్తున్న సమయంలోనే ఇటు ఆచార్య సినిమాలో షూటింగులో పాల్గొన్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

    కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఈ పాటలకు మెగా అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Acharya, Chiranjeevi, Raja mouli, Ram Charan, SS Rajamouli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు