రామ్ చరణ్,ఎన్టీఆర్ (Ram Charan ntr Friendship)వీరి స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ అంటే రామ్ చరణ్‌కు ఎంతో ఇష్టం.. అదే సందర్భంలో ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ దోస్తీపై ఎన్నో సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన స్నేహానికి ఎవరి దిష్టి తగలకూడదన్నాడు. అయితే ఇవాళ ఎన్టీఆర్ బర్త్ డే(Jr Ntr Birthday) సందర్భంగా రామ్ చరణ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘బ్రదర్,కో స్టార్,ఫ్రెండ్.. నువ్వు నాకెంటో చెప్పడానికి నా దగ్గర పదాలు కూడా లేవు.. మనదగ్గర ఉన్నవాటిని నేనెప్పుడు ఆనందంగా ఫీల్ అవుతాను’ అంటూ.. రామ్ చరణ్ ఓ ట్వీట్ చేశాడు. అంతేకాదు.. ఎన్టీఆర్‌ను గట్టిగా హత్తుకున్న ఫోటోను కూడా షేర్ చేశాడు చరణ్. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ పెట్టిన ట్వీట్ పై ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ చరణ్ అన్న..జై ఎన్టీఆర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చరణ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ మూవీ టీం మా భీంకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ.. పోస్టు చేసింది. ఇక ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఎన్టీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే టైగర్.. ఐలవ్ యూ అంటూ హరీశ్ పోస్టు పెట్టారు.
Brother, co-star, friend … I don’t think words can define who you are to me @tarak9999 !
I will always always cherish what we have 🤗
Happy Birthday ! pic.twitter.com/CPHDUEzf6m
— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2022
ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా అభిమానులకు కొన్ని గంటల ముందే తారక్ బర్తడే ట్రీట్ ను అందించాడు. కొద్ది సేప్పటి క్రితమే #NTR30 సినిమా కి సంబంధించిన డైలాగ్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమా పవర్‌ఫుల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు ఈ స్పెషల్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. నేపథ్య సంగీతం ఓ స్థాయిలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తాజా గా రిలీజ్ చేసిన వీడియో తారక్ చెప్పే డైలాగ్ యువత ని బాగా ఆకట్టుకుంటుంది. ' మాస్ బేస్ వాయిస్ తో తారక్..అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి దమ్ము ఉండకూడదు అని..అప్పుడు ఆ టైంలో భయానికి తెలియాలి..తాను రావాల్సిన సమయం ఆసన్నమైంది' అంటూ గూస్ బంప్స్ తెప్పించే ఎన్టీఆర్ డైలాగ్స్ అదిరిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Ram Charan, RRR