హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan: RC15 టైటిల్ రిలీజ్... గేమ్ ఛేంజర్‌గా వస్తున్న రామ్ చరణ్..!

Ram Charan: RC15 టైటిల్ రిలీజ్... గేమ్ ఛేంజర్‌గా వస్తున్న రామ్ చరణ్..!

రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

తాజాగా సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 8:19 గంటలకు టైటిల్ విడుదల చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా RC15. ఈ సినిమాను  టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీంతో ఇప్పటికే  మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 8:19 గంటలకు టైటిల్ విడుదల చేశారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) అనే టైటిల్‌ను   ఫిక్స్ చేశారు మేకర్స్.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది . శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

మధ్యాహ్నం 3:06 గంటలకు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే ఆరెంజ్ రీ-రిలీజ్ జోష్ లో ఉన్న అభిమానులకు ఈ అప్డేట్ తొ ఫుల్ హైప్ ఇచ్చరు మేకర్స్. మరోవైపు ఈ  సినిమాను దిల్ రాజు పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు అనే వార్త ఎప్పటినుండో ప్రచారం అవుతోంది. అయితే అది పక్కాగా నిజమే అని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండవ పాత్రకి అంజలి జోడిగా కనిపించనుందని సమాచారం.

First published:

Tags: Ram Charan, RC 15

ఉత్తమ కథలు