మహేష్ మేనల్లుడి కోసం రామ్ చరణ్..

తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు.

news18-telugu
Updated: November 10, 2019, 12:10 PM IST
మహేష్ మేనల్లుడి కోసం రామ్ చరణ్..
Twitter
  • Share this:
తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. అందులో భాగంగా సినిమా ప్రారంభోత్సవ వేడుకను ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమ కోసం నటుడు రామ్‌ చరణ్‌ అతిథిగా వచ్చి.. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టాడు. చరణ్‌తో పాటు ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, దగ్గుబాటి రానా తదితరులు పాల్గొన్నారు.  ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. శ్రీరామ్ గతంలో భ‌లే మంచి రోజు, శ‌మంత‌క మ‌ణి, దేవ‌దాస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాలో గల్లా అశోక్ సరసన ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్ నటిస్తోంది. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ బాణీలు అందించబోతున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.


కాగా ఈ సందర్భంగా మహేష్ బాబు తన మేనల్లుడికి శుభాకాంక్షలు చెబుతూ బాగా కష్టపడి పనిచెయ్, నువ్వు నేర్చుకున్నదంతా ఇవ్వు.. ఆ విజయమే నిన్ను వెతుక్కుంటూ వస్తుందని ట్విట్టర్ వేదికగా విషేష్ తెలిపారు.అల్లు అర్జున్‌తో పూజా హెగ్డే పారిస్ టూర్..
First published: November 10, 2019, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading