Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: September 3, 2019, 10:54 PM IST
రామ్ చరణ్ రాజమౌళి ఫైల్ ఫోటోస్
రామ్ చరణ్ ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు.. నిర్మాత కూడా. ఆయన టెన్షన్స్ ఆయనకు ఉంటాయి. పైగా రామ్ చరణ్ నిర్మిస్తుంది చిన్న సినిమా కూడా కాదు. 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సైరా సినిమా నిర్మిస్తున్నాడు మెగా వారసుడు. దాంతో టెన్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. రిలీజ్ డేట్ కూడా దగ్గరకు వస్తుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచేస్తున్నాడు రామ్ చరణ్. అయితే ఇప్పుడు సైరాకు కాకుండా RRR కోసం టైమ్ కేటాయించాలని చూస్తున్నాడు చరణ్.

ఆర్ఆర్ఆర్ షూటింగ్లో తారక్, రామ్ చరణ్...
ఈయన ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. అసలే ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే నెమ్మదిగా జరుగుతుంది. ఓ సారి చరణ్ గాయం.. మరోసారి ఎన్టీఆర్ గాయం.. మొన్నటికి మొన్న రాజమౌళి అమెరికా ట్రిప్.. ఆ తర్వాత రామ్ చరణ్ మాల్దీవ్స్.. ఇలా ఎప్పటికప్పుడు RRR షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమవుతుంది. ప్రస్తుతం బల్గేరియాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. దీని తర్వాత తమిళనాడు షెడ్యూల్.. ఆ తర్వాత డెహ్రాడూన్ షెడ్యూల్ ప్లాన్ చేసాడు దర్శకధీరుడు. ఇక ఇప్పుడు మరోసారి కూడా RRR షూటింగ్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.

తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)
రామ్ చరణ్ ప్రత్యేకంగా రాజమౌళిని కొన్ని రోజులు అనుమతి కోరనున్నాడనే ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం సైరా ప్రమోషన్సే. ఈ సినిమా కోసం తానే హోస్టుగా మారి కొన్ని ఇంటర్వ్యూలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మెగా వారసుడు. అలా చేస్తే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాడు చరణ్. సైరా కోసం ప్రత్యేకంగా రెండు నెలలు కేటాయించాలని చూస్తున్నాడు చరణ్. టీజర్‌తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలోనే ప్రమోషన్స్‌లో వేగం పెంచాలని భావిస్తున్నాడు ఈయన. మొత్తానికి పరిస్థితులు చూస్తుంటే RRRకు మరో భారీ బ్రేక్ తప్పేలా లేదు. జులై 30, 2020న RRR విడుదల కానుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
September 3, 2019, 10:53 PM IST