Ram Charan : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో (Pooja Hegde )పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకమైన ఈ సినిమా మంచి టాక్‌తో ఇపుడు బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది. అంతేకాదు 6 యేళ్లుగా హిట్ కోసం ఎదురు చేస్తున్న అక్కినేని వారసుడికి ఈ సినిమాతో అఖిల్ తన కెరీర్‌లో తొలి హిట్ అందుకున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్‌గా ఉందని ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ గత సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే... 4 రోజులకు కలిపి రూ. 1.59 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా రూ. 19 కోట్లను ప్రపంచ వ్యాప్తంగా షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ రోజు నుంచి ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు. అంతేకాదు తన సోదరుడు అఖిల్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు. మరోసారి పూజా హెగ్డే తన నటనతో మాయ చేసిందన్నారు. అంతేకాదు గీతా ఆర్ట్స్ బొమ్మరిల్లు భాస్కర్ మరోసారి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో ఈ సినిమాను తెరకెక్కించారని ప్రశంసలు ఝల్లు కురిపించారు.
So happy for my brother @AkhilAkkineni8 on the success of #MostEligibleBachelor ?
Loved your performance in this film. @hegdepooja you nailed it again??
Many congratulations to @GA2Official & Bhaskar
We thoroughly enjoyed it ? pic.twitter.com/rEMXJR7Z51
— Ram Charan (@AlwaysRamCharan) October 19, 2021
రామ్ చరణ్ విషయానికొస్తే.. ఈయన హీరోగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే యేడాది జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు తన తండ్రి చిరంజీవితో పూర్తి స్థాయిలో నటించిన ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మరోవైపు శంకర్, ఆ తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమాలు ఉండనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil Akkineni, Most Eligible Bachelor, Pooja Hegde, Ram Charan, Tollywood