సైరా కోసం నన్ను శారీరకంగా హింసించారు.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..

సైరా పోస్టర్

Sye Raa: సైరా కోసం ఆరు పదుల వయసులోనూ చిరంజీవి కష్టపడ్డ తీరు విమర్శకులను సైతం మెప్పించింది. సినిమా ఆసాంతం గుర్రపు స్వారీలు, డూప్ లేకుండా ఫైట్లు.. ఇలా ఎంతో శ్రమించాడు.

  • Share this:
బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన సినిమా సైరా. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఈ నెల 2న దేశవ్యాప్తంగా విడుదలైంది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాలో చిరుతో పాటు భారీ తారాగణం నటించింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతార, తమన్నా,జగపతి బాబు.. ఇలా పెద్ద నటీనటులు తమ వంతు పాత్ర పోషించారు. ఖైదీ 150 సినిమా తర్వాత చిరు ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల పాటు కష్టపడ్డాడు. సొంత కొణిదెల ప్రొడక్షన్స్‌లో, తన తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు. అయితే, ఆరు పదుల వయసులోనూ చిరంజీవి కష్టపడ్డ తీరు విమర్శకులను సైతం మెప్పించింది. సినిమా ఆసాంతం గుర్రపు స్వారీలు, డూప్ లేకుండా ఫైట్లు.. ఇలా ఎంతో శ్రమించాడు. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాపై చిరంజీవి పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు.

భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు అద్భుతమని, అయితే.. వాటి కోసం తనను శారీరకంగా హింస పెట్టి యాక్షన్ సన్నివేశాలను రాబట్టారని వెల్లడించాడు. తాను ఆ పోరాట సన్నివేశాలు చేస్తానో, చేయలేనోనని భయపడితే.. టెక్నాలజీ వచ్చిందని, దానితో మేనేజ్ చేయవచ్చని ముందుగా చెప్పి, ఆ తర్వాత తనను హింసించారని, ఆ సమయంలో ఏం చేయాలో తెలీలేదని తెలిపాడు. మేకప్ వేసుకొని కత్తి పట్టి, గుర్రం ఎక్కాక ఒళ్లు మరిచిపోయానని, వయసు మరిచిపోయానని వివరించాడు. 25 ఏళ్ల క్రితం ఏ జోష్‌లో ఉన్నానో అదే జోష్ వచ్చేసిందని చెప్పాడు. తాను చేసిన పోరాట సన్నివేశాలను చూసి.. తన భార్య కూడా ఆశ్చర్యపోయిందని తెలిపాడు చిరంజీవి.
First published: