Home /News /movies /

RAM CHARAN AND SUKUMAR FANS DOES NOT WANT A SEQUEL OF TOLLYWOOD SUPER HIT MOVIE RANGASTHALAM

Rangasthalam: సీక్వెల్ వద్దు మహాప్రభూ అంటూ 'రంగస్థలం' టీమ్‌కు మొరపెట్టుకుంటున్న నెటిజన్లు.. ఎందుకంటే?

rangasthalam

rangasthalam

Rangasthalam: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం బెస్ట్ సినిమాగా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అభిమానులనే కాకుండా ప్రేక్షకులకు కూడా బాగా ఆకట్టుకుంది.

    Rangasthalam: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం బెస్ట్ సినిమాగా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అభిమానులనే కాకుండా ప్రేక్షకులకు కూడా బాగా ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్లాసికల్ పాత్రలతో బాగా ఆకట్టుకుంది. ఇందులో అక్కినేని సమంత హీరోయిన్ గా బాగా నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను సీక్వెల్ గా రూపొందిస్తున్నారన్న వార్తలు వినిపించగా అభిమానులు మాత్రం మాకొద్దు అంటున్నారు.

    ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఒక క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక అలాంటి సినిమాకు సీక్వెల్ గా రూపొందిస్తే మొదటి భాగంలో ఉన్న సినిమా క్రేజ్ మొత్తం పోతుందని, ఏమాత్రం తేడా జరిగినా సినిమా పక్క ఫ్లాప్ అవుతుందని అభిమానులు ఈ సీక్వెల్ మాత్రం మాకు వద్దు బాబోయ్ అని వేడుకుంటున్నారు. ఈ సినిమా స్థానంలో మళ్లీ సుకుమార్, రామ్ చరణ్ దర్శకత్వంలో వేరే సినిమా వచ్చిన పర్వాలేదు కానీ ఈ సినిమాను మాత్రం సీక్వెల్ గా చేయొద్దని కోరుతున్నారు.

    ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు. అంతే కాకుండా రామ్ చరణ్ మరో క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఎటువంటి ప్రాజెక్టులు లేకపోగా.. రంగస్థలం సీక్వెల్ గురించి వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాను అభిమానుల మేరకు వదిలేస్తారా లేదా వాళ్ళు కోరినట్లు మరో సినిమాలో చేస్తారా వేచి చూడాల్సిందే.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Ram Charan, Rangasthalam, Samantha akkineni, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు