మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం మారేడుమిల్లిలో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజా సమాచారం మేరకు చిరంజీవి, చరణ్‌లపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొన్నటి వరకు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన కొరటాల ఇప్పుడు రామ్‌చరణ్, పూజా హెగ్డేపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఇప్పుడు చరణ్, పూజా హెగ్డేపై మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మెగాస్టార్ తన మారేడు మిల్లిలో తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసి హైదరాబాద్ చేరుకుంటాడు.
ఆచార్యలో సిద్ధ అనే నక్సలైట్ నాయకుడు పాత్రలో రామ్‌చరణ్ కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మొన్నటికి మొన్న కోకాపేటలోని టెంపుల్ సెట్లో చిత్రీకరించారు. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న పుష్ప సినిమా లొకేషన్లోనే ఆచార్య సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. చిరంజీవి ఆచార్య అనే మాజీ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు.
చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్‌చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.