కొరటాల శివ డైరెక్ట్ చేసింది నాలుగు సినిమాలే అయిన వరుసగా సూపర్ హిట్స్ ఇస్తూ తెలుగు ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్ మిర్చితో దర్శకత్వం మొదలు పెట్టిన శివ స్టార్ హీరోలతో చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. రీసెంట్గా ఆయన మహేష్ బాబుతో భరత్ అనే నేను చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే శివ మొదటి సినిమా ‘మిర్చి’ తర్వాత రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్రకటించాడు. అంతేకాదు శివ చెప్పిన కథ చెర్రీకి బాగా నచ్చేసింది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ శివకు తాను చెప్పిన కథపై నమ్మకం తగ్గింది. కథలో ఏదో కొంత అసంతృప్తి, ఏదో చిన్న సందేహం. ఎన్నిసార్లు మార్పులు చేసినా కథ అనుకున్నట్లు రావట్లేదు. దీంతో చరణ్‌తో చేస్తే బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇవ్వాలి. అంతేకాని తొందరపడి సినిమా ప్రకటించామని ఏదో తీసేయడం బావుండదనుకున్నాడట దర్శకుడు శివ. ఇదే విషయాన్ని చరణ్‌తో డిస్కస్ చేయగా.. చెర్రీ స్పందిస్తూ.. ‘కథను తెరకెక్కించాల్సింది మీరు! నేను కేవలం మీరు ఎలా చెబితే అలా చేస్తాను అన్నారంట.. అంతేకాదు మీకు ఈ కథపై ఎప్పుడు నమ్మకం వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేద్దాం’ అని చెప్పాడట చరణ్. అలా ఈ ఇద్దరీ కాంబినేషన్లో రావాల్సిన సినిమా అలా ఆగిపోయింది.
అయితే ఇంకా అభిమానులు ఆ చిత్రం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అన్ని కుదిరితే ఈ చిత్రం భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి మరీ. కాగ కొరటాల శివ ప్రసుత్తం చిరంజీవితో చేస్తున్నారు. ఈ ‘చిరంజీవి 152’ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కేక పెట్టిస్తోన్న రాశీ ఖన్నా.. అదిరిపోయిన లేటెస్ట్ పిక్స్..
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.