NTR | Ram Charan : పాటల పల్లకిలో ఎన్టీఆర్ రామ్ చరణ్‌లు.. విదేశాలకు పయనం...

NTR Ram, Charan Photo : Twitter

NTR | Ram Charan : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఇక ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్‌ను ఓ రేంజ్‌లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలోని ఓ పాట షూటింగ్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉక్రెయిన్‌కు బయలుదేరనున్నారు. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో ఓ పాటను చిత్రీకరించనున్నారు. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్ మొదలగు వారు అక్కడికి వెళ్లనున్నారు. ఉక్రెయిన్ షెడ్యూల్ తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌లు నటిస్తున్నారు.. ఇక ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ఓ మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదలచేసిన సంగతి తెలిసిందే.

    ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: