మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించింది. సత్యరాజ్ కీలక పాత్రలో నటించాడు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకులతో పాటు సినీ నటులు అభినందిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్. ఈ సినిమా చూసి ప్రతిరోజూ పండగే యూనిట్‌ను అభినందించాడు. కుటుంబ విలువల్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అందరు తప్పకుండా చూడాలన్నారు.
మరోవైపు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం చూసి మెచ్చుకున్నారు. ఈ చిత్రంతో నా కజిన్ సాయి ధరమ్ తేజ్ మంచి హిట్ అందుకున్నాడు. మరోవైపు నా మిత్రుడు మారుతి ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. మరోవైపు బన్నివాసు ఈ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఇంకోవైపు ఈ సినిమాతో మా నాన్న అల్లు అరవింద్‌కు, యూవీ క్రియేషన్స్ వాళ్లకు మంచి లాభాలొచ్చాయన్నారు.
Congratulations to the Entire team of Prathi Raju Pandage. So glad my cousin Sai Tej has a good hit , my friend Maruthi has a success, My Life Line Vasu has a good film in his account & My Father has more Profits . Congratulations to UV films. pic.twitter.com/erYDa3jVxs
— Allu Arjun (@alluarjun) December 24, 2019
‘ప్రతిరోజూ పండగే’ చిత్ర విషయానికొస్తే..సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే యూఎస్‌లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా దూసుకుపోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu aravind, Allu Arjun, Maruthi, PratiRoju Pandaage, Ram Charan, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood, UV Creations