సంచలన రీమేక్‌లో రామ్ చరణ్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..

రామ్ చరణ్ ఒకప్పుడు మూస సినిమాలు చేసేవాడని విమర్శలుండేవి. కానీ ఒకే ఒక్క సినిమాతో వాటిని పోగొట్టేసాడు మెగా వారసుడు. గతేడాది ఈయన నటించిన రంగస్థలం రికార్డులు తిరగరాసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 23, 2019, 11:58 AM IST
సంచలన రీమేక్‌లో రామ్ చరణ్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
రామ్ చరణ్ రంగస్థలం
  • Share this:
రామ్ చరణ్ ఒకప్పుడు మూస సినిమాలు చేసేవాడని విమర్శలుండేవి. కానీ ఒకే ఒక్క సినిమాతో వాటిని పోగొట్టేసాడు మెగా వారసుడు. గతేడాది ఈయన నటించిన రంగస్థలం రికార్డులు తిరగరాసింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో ఈ మధ్య కాలంలో ఏ హీరో కనీసం సాహసం కూడా చేయని కథనంతో వచ్చింది. ఇందులో చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర కూడా సంచలనమే. ఈ సినిమాతో నటుడిగా చాలా మెట్లు ఎదిగాడు రామ్ చరణ్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్.

Ram Charan all set to act in Dhanush latest blockbuster Asuran telugu remake and talks is going on pk రామ్ చరణ్ ఒకప్పుడు మూస సినిమాలు చేసేవాడని విమర్శలుండేవి. కానీ ఒకే ఒక్క సినిమాతో వాటిని పోగొట్టేసాడు మెగా వారసుడు. గతేడాది ఈయన నటించిన రంగస్థలం రికార్డులు తిరగరాసింది. ram charan,ram charan asuran remake,ram charan twitter,ram charan instagram,ram charan movies,ram charan dhanush,ram charan dhanush asuran,dhanush asuran movie,asuran movie collections,ram charan rangasthalam,asuran telugu remake,telugu cinema,vetri maran asuran movie,dhanush asuran movie telugu,అసురన్,రామ్ చరణ్,రామ్ చరణ్ రంగస్థలం,రామ్ చరణ్ అసురన్ రీమేక్,తెలుగు సినిమా
రామ్ చరణ్ అసురన్ రీమేక్

మరోవైపు తండ్రి సినిమాలు కూడా నిర్మిస్తూ బిజీ అయిపోయాడు. ఇలాంటి తరుణంలో ఈయన మనసు ఓ తమిళ సినిమా వైపు వెళ్తుందని తెలుస్తుంది. త‌మిళంలో ఈ మధ్యే విడుదలైన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన టాలీవుడ్ నిర్మాతల్లో మొదలైంది. ధ‌నుష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌ల వర్షం కురుస్తుంది. మహేష్ బాబు ఈ చిత్రం చూసి ధనుష్‌ను ఓ రేంజ్‌లో పొగిడేసాడు.

Ram Charan all set to act in Dhanush latest blockbuster Asuran telugu remake and talks is going on pk రామ్ చరణ్ ఒకప్పుడు మూస సినిమాలు చేసేవాడని విమర్శలుండేవి. కానీ ఒకే ఒక్క సినిమాతో వాటిని పోగొట్టేసాడు మెగా వారసుడు. గతేడాది ఈయన నటించిన రంగస్థలం రికార్డులు తిరగరాసింది. ram charan,ram charan asuran remake,ram charan twitter,ram charan instagram,ram charan movies,ram charan dhanush,ram charan dhanush asuran,dhanush asuran movie,asuran movie collections,ram charan rangasthalam,asuran telugu remake,telugu cinema,vetri maran asuran movie,dhanush asuran movie telugu,అసురన్,రామ్ చరణ్,రామ్ చరణ్ రంగస్థలం,రామ్ చరణ్ అసురన్ రీమేక్,తెలుగు సినిమా
రామ్ చరణ్ అసురన్ రీమేక్
వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందని కొందరు నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రంగస్థలం తరహాలోనే పూర్తి స్థాయి రా కంటెంట్‌తో ఈ చిత్రం వచ్చింది. దాంతో ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి చరణ్ అయితే ఈ రీమేక్‌కు బాగా సూట్ అవుతాడని భావిస్తున్నారు నిర్మాతలు. మళయాల నటి మంజు వారియ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్. ఒకవేళ అసురన్ సినిమా కానీ రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తే అది నిజంగానే మరో రంగస్థలం కావడం ఖాయం.
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>