టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించాడు. ఇన్ని రోజులు రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపించాడా అనే డౌట్స్ వస్తున్నాయా.. ఇంతకీ మేటరేమిటంటే.. రామ్ చరణ్.. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో పాటు రీసెంట్గా ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చారిత్రక కథాంశాన్ని సినిమాగా తెరకెక్కించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి చిరంజీవి సినిమాకు కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు చెర్రీ.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, అజయ్ దేవ్గణ్లతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ చిత్రం వచ్చే యేడాది విడుదల కానుంది. అది పక్కనపెడితే.. రామ్ చరణ్.. రీసెంట్గా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ సినిమా రీమేక్ రైట్స్ కొన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్నిసుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఈ చిత్రంలో తొలిసారి చిరంజీవి, రామ్ చరణ్ పూర్తిస్థాయిలో కలిసి నటించబోతున్నట్టు చెప్పుకుంటున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ రైట్స్ సంపాదించిన రామ్ చరణ్ (Twitter/Photo)
తాజాగా రామ్ చరణ్.. మరో మలయాళ సూపర్ హిట్టైన ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. పృథ్వీరాజ్ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్టైయింది. ఈ సినిమా రీమేక్‌లో రామ్ చరణ్ నటిస్తాడా.. ? వాళ్ల ఇంట్లో ఉన్న వేరే హీరోలతో రీమేక్ చేస్తాడా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:February 18, 2020, 15:10 IST