రాజమౌళి ఛాలెంజ్ స్వీకరించిన రామ్ చరణ్.. ఆ నలుగురికి సవాల్..

ప్రస్తుతం మన దేశం కరోనాపై పోరాడుతోంది. ఇప్పటికే మన దేశంలో వచ్చే నెల మూడు వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. తాజాగా రామ్ చరణ్.. రాజమౌళి విసిరిని ‘బి ది రియల్ మేన్’ ను స్వీకరించిన మరో నలుగురిని నామినేట్ చేసాడు.

news18-telugu
Updated: April 22, 2020, 8:04 AM IST
రాజమౌళి ఛాలెంజ్ స్వీకరించిన రామ్ చరణ్.. ఆ నలుగురికి సవాల్..
ఇంట్లో పనులు చేసిన రామ్ చరణ్ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం మన దేశం కరోనాపై పోరాడుతోంది. ఇప్పటికే మన దేశంలో వచ్చే నెల మూడు వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు మినహాయిస్తే మిగతావన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. . లాక్‌డౌన్ కారణంగా అందరు సెలబ్రిటీలు ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటున్నారు. దీంతో ఏమి చేయాలో తోచక ఒకరికొకరు డిఫరెంట్ ఛాలెంజెస్ విసురుకుంటున్నారు. ఎపుడు ఇంట్లో వంటింటి ముఖం వైపు చూడని హీరో, హీరోయిన్లు, దర్శకులు ఇపుడు ఇంట్లో ఒక రోజు గిన్నెలు తోమి, ఇళ్లు తుడుస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి ప్రారంభించిన ‘బి ది రియల్ మేన్’  విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన రాజమౌళి.. ఇంటిపనులు చేయాలని ఎన్టీఆర్, రాజమౌళిని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఎన్టీఆర్ ఇంట్లో పనులు చేసి బాబాయి బాలయ్యకు, హీరో నాగార్జున, వెంకటేష్, చిరంజీవికి ఈ చాలెంజ్ విసిరారు.

తాజాగా రామ్ చరణ్.. రాజమౌళి విసిరిని ఛాలెంజ్ పూర్తి చేసి ఇంట్లో పనులు చేసాడు. అందకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. ఈ వీడియోలో రామ్ చరణ్ ఇంట్లో బట్టలు ఉతకడం దగ్గర నుంచి ఇల్లు మొత్తం తుడవడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటివి పూర్తి చేసి.. దర్శకుడు త్రివిక్రమ్, హీరోలు రానా దగ్గుబాటి, శర్వానంద్‌తో పాటు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్‌కు నామినేట్ చేసాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 22, 2020, 8:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading