రకుల్ చేసిన ఆ పనికి ఆశ్చర్యపోతున్న అభిమానులు..

Rakul Preet Singh | రకుల్.. తెలుగులో ఇప్పుడు  ఓ టాప్ హీరోయిన్. ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ, తమిళ సినిమాల్లోను అదరగొడుతోంది.

news18-telugu
Updated: October 12, 2019, 8:10 AM IST
రకుల్ చేసిన ఆ పనికి ఆశ్చర్యపోతున్న అభిమానులు..
Instagram/rakulpreet
  • Share this:
Rakul Preet Singh | రకుల్.. తెలుగులో ఇప్పుడు  ఓ టాప్ హీరోయిన్. ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ, తమిళ సినిమాల్లోను అదరగొడుతోంది. రకుల్ ‘కెరటం’ అనే సినిమాతో  తెలుగు తెరకు పరిచయమైన సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తెలుగు వారికి దగ్గరైంది. ఈ సినినిమా తర్వాత నుండి తన అంద చందాలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొడుతోంది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మధ్య  తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. 

View this post on Instagram
 

Kickastarting the day with what I love the most !! Connecting with nature in nature ❤️ #selflove #bdayvibes #peace #beauty #healthyliving @thepavilionsphuket !! #yogalove @anshukayoga ❤️❤️❤️ #phuket


A post shared by Rakul Singh (@rakulpreet) on

ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తన అందాల శరీరాన్ని విల్లులా వంచి అదరగొట్టెస్తోంది. మొత్తం శరీరాన్ని విల్లులా చేసి.. యోగా విన్యాసాలతో ప్రశంసలు అందుకుంటోంది. దానికి సంబందించిన కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు.. వావ్ రకుల్.. అంటూ రకుల్ చేసిన యోగా విన్యాసాలను చూసి ఆశ్చర్చంతో కామెంట్స్ పెడుతున్నారు. అది అలా ఉంటే రకుల్ ఫిట్నెస్ బిజినెస్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ భామ సినీ కెరీర్ ప్రస్తుతం కొంత స్లోగా వున్న తన బిజినెస్‌లో మాత్రం అదరగొడుతోంది.
First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>