Rakul Preeth Singh - Covid-19 Positive: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఆమెనే తెలియజేసింది. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా రకుల్ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తన అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు తన ఆరోగ్య సంగతి గురించి వివరణ ఇచ్చింది. ‘‘నేను మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు కోవిడ్ 19గా నిర్ధారణ అయ్యింది. నాకు నేనుగా క్వారంటైన్లో ఉండిపోయాను. నేను ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. త్వరలోనే సెట్ అయిపోతానని భావిస్తున్నాను. త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాను. నన్ను ఈ మధ్య కాలంలో కలిసిన వారందరూ చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.. జాగ్రత్తగా ఉండాలి’’ అంటూ రకుల్ వివరణ ఇచ్చింది. ఈ మెసేజ్ చూసిన అభిమానులు రకుల్ త్వరగా కోలుకోవాలని రీట్వీట్స్ చేస్తున్నారు. అసలు రకుల్‌కు కోవిడ్ ఎలా సోకిందని అభిమానులందరూ టెన్షన్లో ఉన్నారు. టాలీవుడ్ పరిశ్రమలో తమన్నా, రాజశేఖర్ దంపతులు, రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి తదితరులకు కోవిడ్ పాజిటివ్ సోకింది. అందరూ కోవిడ్ నుండి సేఫ్‌గా బయటపడినవారే.
ఫిట్నెస్ ఫ్రీక్‌గా అయిన రకుల్ ప్రీత్ సింగ్ కోవిడ్ సమయం ఇంటికే పరిమితమైంది.. షూటింగ్స్ చేసుకోవడానికి అనుమతలు ఇచ్చిన తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్‌తో కలిసి ఓ సినిమాలో నటించింది. అలాగే నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో రూపొందిన చెక్ సినిమాలోనూ నటించింది. అలాగే సామ్జామ్లోనూ సమంతతో కలిసి సందడి చేసింది. ఫిట్నెస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండే రకుల్ ప్రీత్ సింగ్ కోవిడ్‌కు భయపడకుండా పాజిటివ్‌గా రియాక్ట్ కావడం కూడా ఆమె అభిమానులను సంతోష పెట్టే విషయమే.

రకుల్ ప్రీత్ Photo : Twitter
ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్ రకుల్ తమిళంలో ఓ సినిమా చేస్తుంది. అలాగే హిందీలోనూ ఎటాక్, సర్దార్ అండ్ గ్రాండ్ సన్ అనే సినిమాలోనూ నటిస్తుంది. సినిమాలతో, వ్యాయామాలతో బిజీ బిజీగా ఉండే, రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ కేసులో ప్రముఖంగా వినిపించింది. ఈ వివాదంలో రకుల్ మీడియాపై కోర్టుకెక్కి విజయాన్ని కూడా సాధించింది. తదుపరి సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధమవుతున్న సమయంలో ఆమెకు కరోనా సోకింది.