దర్శకుడు క్రిష్, రకుల్ ప్రీత్, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో ఇంట్రెస్టింట్ పాయింట్‌తో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తాజా చిత్రానికి మొన్నటి వరకు కొండపొలం అనే పేరును పరిశీలిస్తున్నారని టాక్ రాగా.. తాజాగా మరోపేరు హల్ చల్ చేస్తోంది. కరోనా లాక్ డౌన్ సమయంలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యింది.. ఓ 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా తెరకెక్కింది. ఇక ఈ చిత్రానికి కొండపోలం అని పేరు ఫిక్స్ అయ్యిందని టాక్ రాగా.. తాజాగా మరోపేరు వినబడుతోంది. ఈ చిత్రం టైటిల్‌గా ‘జంగిల్ బుక్’ అనే పేరును లాక్ చేసినట్లు తాజా సమాచారం. ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ భారీ హిట్‌ను అందుకున్నాడు. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన ఉప్పెన బక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. దాదాపు 70 కోట్ల గ్రాస్‌తో దూసుకుపోతోంది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి.
ఇక ఉప్పెన ఇచ్చిన బూస్ట్‌తో మంచి ఊపు మీదున్న వైష్ణవ్ తేజ్ నిర్మాతలు తన రెండో సినిమాను కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తో రూపొందింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మాలని ముందుగా అనుకున్నారట దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు ఉప్పెన భారీ హిట్ కావడంతో తమ ఆలోచనను మార్చుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను భారీ ధరకు దిల్ రాజు క్యాంప్ నుండి బయటకు వచ్చిన లక్ష్మణ్ కొన్నాడని టాక్. లక్ష్మణ్ దాదాపు 11 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ సినిమా థియేటిరికల్ రిలీజ్ గురించి ఓ అధికార ప్రకటన రానుందని సమాచారం. ఈ సినిమాను ఆగస్టులో విడుదలచేయనున్నారని తెలుస్తోంది.
View this post on Instagram
వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్. నవలలో ఎక్కువ భాగం కథ నల్లమల అడవులలోని గొర్రెకాపరుల జీవితాలపై నడుస్తుంది. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. మరి సినిమాలో కథ ఎలా ఉండనుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసిందని టాక్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.