రకుల్ ప్రీత్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. నాతో పెట్టుకోవద్దు అంటున్న బ్యూటీ..

ఒకవైపు తెలుగు,మరోవైపు తమిళం, ఇంకోవైపు హిందీ ఇలా విభిన్న భాషల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రకుల్  ప్రీత్ సింగ్.తాజాగా ఈ భామ తనపై తప్పుడు వార్తలు రాస్తున్న వారికి ట్విట్టర్ వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

news18-telugu
Updated: December 2, 2019, 11:23 AM IST
రకుల్ ప్రీత్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. నాతో పెట్టుకోవద్దు అంటున్న బ్యూటీ..
రకుల్ ప్రీత్ సింగ్ (Instagram/Photo)
  • Share this:
ఒకవైపు తెలుగు,మరోవైపు తమిళం, ఇంకోవైపు హిందీ ఇలా విభిన్న భాషల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రకుల్  ప్రీత్ సింగ్. నటిగా ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రకుల్ మరోసారి ట్విట్టర్ వేదికగా తన గురించి కొన్ని మీడియాల్లో (న్యూస్ 18 కాదు)తనపై  అసత్య వార్తలు రాస్తున్న వారినపై మండిపడ్డారు. తన గురించి నిజమైన వార్తలను మాత్రమే ప్రచారం చేయండి అంటూ ట్వీట్ చేసింది. కొన్నేళ్ల క్రితం రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌కు టాటా చెప్పేసి బెంగళూరుకు ఫిఫ్ట్ అయిపోయిందనే పుకార్లు షికార్లు చేసాయి. అందుకే రకుల్ హైదరాబాద్‌లో తన ఇంటిని తక్కువ ధరకే అమ్మేసిందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు బెంగళూరులో అందమైన ఇంటిని కొనుగోలు చేశారంటూ వార్తలు వెలుబడ్డాయి.  దీంతో రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ.. నాపై వస్తున్న వార్తలన్ని అవాస్తవాలని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో నేను ఉంటున్న ఇంటిని ఎవరో తనకు గిఫ్ట్‌గా ఇచ్చారని రాసారు. దయచేసి ఇలాంటి వార్తలను రాయకండి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>