అలా చేయడం తనతో పాటు.. ఎవరి వల్ల కాదంటున్న రకుల్ ప్రీత్ సింగ్..

అవును.. అందరినీ సంతృప్తి పరచడం తన వల్ల కాదంటోంది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియా పుణ్యామా కొంత మంది నెటిజన్స్ ..తను పెట్టే కామెంట్స్‌తో పాటు పోస్టులపై ట్రోల్ చేయడంపై స్పందించింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 27, 2019, 1:12 PM IST
అలా చేయడం తనతో పాటు.. ఎవరి వల్ల కాదంటున్న రకుల్ ప్రీత్ సింగ్..
రకుల్ ప్రీత్ Photo: Twitter.com/Rakulpreet
  • Share this:
అవును.. అందరినీ సంతృప్తి పరచడం తన వల్ల కాదంటోంది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియా పుణ్యామా కొంత మంది నెటిజన్స్ ..తను పెట్టే కామెంట్స్‌తో పాటు పోస్టులపై ట్రోల్ చేయడంపై స్పందించింది. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా ఈ భామకు తెలుగు, తమిళంలో సరైన విజయాలు లేవు. మరోవైపు హిందీలో అజయ్ దేవ్‌గణ్ సరసన నటించిన ‘దే దే ప్యార్ దే’ సినిమా హిట్టైయిన ఆ క్రెడిట్ మొత్తం అజయ్ దేవ్‌గణ్, టబు మాత్రమే దక్కడం రకుల్‌ను మరింత నిరాశకు గురిచేసింది. మరోవైపు ీ సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ  రీమేక్‌లో కూడా టబుతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేయడం విశేషం. మరోవైపు తెలుగులో నాగార్జున సరసన ‘మన్మథుడు 2’ చేస్తోంది. ఈ సినిమాపై రకుల్ భారీ ఆశలే పెట్టుకుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఈ భామ తమిళంలో సూర్య సరసన నటించిన ‘ఎన్జీకే’ మూవీ ఫ్లాప్‌తో నారాజ్ అయిపోయింది. అంతేకాదు త్వరలో విజయ్ సరసన నటించే అవకాశం కోసం వెయిట్ చేస్తోంది.

అవును.. అందరినీ సంతృప్తి పరచడం తన వల్ల కాదంటోంది ఈ హాట్ బ్యూటీ. సోషల్ మీడియా పుణ్యామా కొంత మంది నెటిజన్స్ ..తను పెట్టే కామెంట్స్‌తో పాటు పోస్టులపై ట్రోల్ చేయడంపై స్పందించింది. వివరాల్లోకి వెళితే..

అందులో భాగంగా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ వార్తల్లో నడుస్తోంది. ఐతే.. చాన్సుల విషయం పక్కనపెడితే..నెటిజన్స్ మాత్రం ఈ అమ్మడిని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ...కొందరు పనీ పాటా లేని వారు ఉంటారు వాళ్లే..ఏమి తోచక ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. తాను మాత్రం తన స్నేహితులు, తల్లి తండ్రుల అభిప్రాయాలను గౌరవిస్తానని.. ఇతరులు చెప్పే విషయాలను పట్టించుకోనని కుండబద్దలు కొట్టింది. అంతేకాదు లోకంలో ఉన్న వాళ్లందరికి నచ్చేలా ఉండటం ఎవరి వల్ల కాదంటూ గడుసు సమాధాన మిచ్చింది.

 

First published: June 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>