గత కొన్నేళ్లుగా రకుల్ ప్రీత్ సింగ్‌కు తెలుగు, తమిళంలో సరైన విజయాలు లేవు. తాజాగా నాగార్జున సరసన నటించిన ‘మన్మథుడు 2’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పెద్దగా ఫలితం రాలేదు. తాజాగా ఈ భామ తన మనసులోని మంచు లక్ష్మీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘వూట్' ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన 'ఫీటప్ విత్ స్టార్స్' కార్యక్రమంలో పాల్గొంది రకుల్‌ప్రీత్ సింగ్. ఇందులో లక్ష్మి మంచుతో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి పలు విషయాలను పంచుకుంది. అంతేకాదు తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా చెప్పింది. తనకు పెళ్లి చేసుకోబోయే వాడు కనీసం ఆరడుగులు ఉండాలని చెప్పింది. అంతకంటే తక్కువైతే.. బాగుండదన్నారు. అంతేకాదు అతను తెలివైన వాడై కూడా ఉండాలి. అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటానని రకుల్ ఈ షోలో వెల్లడించింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.