Home /News /movies /

RAKUL PREET SINGH SAYS I AM STILL NOW SINGLE DUE TO HER BROTHER TA

నా తమ్ముడి వల్లే లైఫ్‌లో చాలా కోల్పోయాను.. రకుల్ సంచలన నిజాలు..

రకుల్ ప్రీత్ Photo :  Instagram

రకుల్ ప్రీత్ Photo : Instagram

Rakul Preet Sing | తెలుగు అగ్ర కథానాయిక రకుల ప్రీత్ సింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందంతో పాటు అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమ

    తెలుగు అగ్ర కథానాయిక రకుల ప్రీత్ సింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందంతో పాటు అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎపుడో ఏదో పని చేస్తూ బిజీగా ఉండే ఈ భామ.. ఇప్పటి వరకు సింగిల్‌ గానే ఉందట.  అంతేకాదు ఇప్పటి వరకు తాను ఎవరినీ ప్రేమించలేదని చెప్పుకొచ్చింది. అందుకు కారణం తన తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్‌  అంటోంది ఈ భామ. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్  తన తమ్ముడుతో కలిసి ఓ‌ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది. నా తమ్ముడు ఎపుడు నా నీడలా నా వెంటే ఉంటాడు. నా తమ్ముడు నన్ను ఎవరితో డేటింగ్ చేయనివ్వలేదు. స్కూల్‌లో చదువుతున్నపుడు నేను అబ్బాయిల పక్కన నిలబడితే... వెంటనే ఇంట్లో మా పేరెంట్స్‌కు కంప్లైట్ చేసేవాడు. ఒకసారి నేను ప్లేట్‌లో ఏవో పెట్టుకొని ఓ అబ్బాయి పక్కన ఊరికే నిలుచున్నాను. ఇక తమ్ముడు అది చూసి నేను ఆ అబ్బాయికి ఏదో తినిసిస్తున్నాని ఇంట్లో చెప్పేశాడంది. ఆ రకంగా నన్ను స్వేచ్ఛగా తిరగకుండా చేసాడు రాక్షసుడు అంటూ సరదగా నవ్వుతూ ఈ విషయాలను చెప్పింది. మరోవైపు అమన్ మాట్లాడుతూ.. నా వల్లే తను ఇలా ఉండిపోయిందనుకుంటాను. నేను అక్క స్కూల్ లైఫ్‌లో ఏమి చేయనీకుండా ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో చాడీలు చెబుతూ అక్కను ముప్పతిప్పలు పెట్టాను. అపుడు అలా చేసుండాల్సింది కాదని ఇపుడు అనిపిస్తోందన్నారు.

    రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)
    రకుల్ ప్రీత్ సింగ్ ఫైల్ ఫోటోస్ (Rakul preet Singh)


    ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్.. ఓ వైపు సినిమాలు.. మరోవైపు జిమ్ బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తన తండ్రితో కలిసి గుర్గావ్‌లోని స్లమ్ ఏరియాలో ఉన్న 250 కుటుంబాలకు రెండు పూటల అన్నం పెడుతోంది. అంతేకాదు లాక్‌డౌన్ ఎఫ్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఈ అన్నవితరణ కొనసాగుతుందని చెప్పుకొచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Rakul Preet Singh, Telugu Cinema, Tollywoood

    తదుపరి వార్తలు