రకుల్ అవకాశాన్ని ఎగరేసుకుపోయిన రష్మిక మందన..

సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరికి దక్కాల్సిన పాత్ర వేరొకరి దగ్గరికి వెళుతుంటాయి. అలా రకుల్ ప్రీత్ సింగ్ చేయాలనకున్న పాత్రను రష్మిక మందన్న ఎగరేసుకుపోయింది.

news18-telugu
Updated: November 20, 2019, 2:29 PM IST
రకుల్ అవకాశాన్ని ఎగరేసుకుపోయిన రష్మిక మందన..
రకుల్ ప్రీత్ సింగ్,రష్మిక మందన్న(File Photo)
  • Share this:
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరికి దక్కాల్సిన పాత్ర వేరొకరి దగ్గరికి వెళుతుంటాయి. ఆయా క్యారెక్టర్లు  వాళ్ల జీవితాన్ని మలుపు తిప్పుతుంటాయి. అలా హీరోయిన్‌గా రష్మిక మందన కెరీర్‌ను ఛేంజ్ చేసిన ‘గీతా గోవిందం’ సినిమాలో కథానాయిక పాత్ర ముందుగా రకుల్ ప్రీత్ సింగ్‌ దగ్గరకి వచ్చిందట. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ.123 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా సక్సెస్‌తో రష్మికకు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ లీగ్‌లో చేరింది. ఈ చిత్రంలో గీత పాత్రకు దర్శక, నిర్మాతలు మొదట రకుల్ ప్రీత్ సింగ్‌ను సంప్రదించారట. అప్పటికే హిందీలో ‘దే దే ప్యార్ దే’ సినిమాకు సైన్ చేయడంతో ఈ సినిమా ఛాన్స్‌ను ఒదలుకోవాల్సి వచ్చింది. ఇక ఆ సినిమా కోల్పోయినందుకు బాధపడటం లేదని, కానీ ఈ చిత్రంలో నటించి ఉంటే బాగుండేదని  చెప్పుకొచ్చింది. ఈ ఇయర్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా నడిచిన దాఖలాలు లేవు.

 

 
First published: November 20, 2019, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading