తల కిందులుగా టీ షర్ట్ వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్..

Rakul Preet Singh: సినిమా షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా తన జిమ్ టైమింగ్ మాత్రం అస్సలు మార్చుకోదు ఈమె. ఓ వైపు జిమ్.. మరోవైపు జిమ్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది రకుల్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2020, 4:21 PM IST
తల కిందులుగా టీ షర్ట్ వేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్..
రకుల్ ప్రీత్ సింగ్ వర్కవుట్ వీడియో (rakul preet singh workout video)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో జిమ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రకుల్ ప్రీత్ సింగ్. ఎప్పుడూ జిమ్‌లో చెమటలు కక్కుతూనే ఉంటుంది ఈమె. సినిమా షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా తన జిమ్ టైమింగ్ మాత్రం అస్సలు మార్చుకోదు ఈమె. ఓ వైపు జిమ్.. మరోవైపు జిమ్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది రకుల్. అలాంటిదిప్పుడు లాక్ డౌన్ కావడంతో ఇంట్లోనే జిమ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందులోనే విన్యాసాలు కూడా చేస్తుంది. తల కిందులుగా ఉండి టీ షర్ట్ వేసుకుంటున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రకుల్. ఇది చూసి నీ ఫిట్‌‌నెస్‌కు ఓ సలాం అంటున్నారు ఫ్యాన్స్. జిమ్ చేయడమే కాదు అదే బిజినెస్‌లో కోట్లు సంపాదిస్తుంది ఈ బ్యూటీ.


జిమ్ బిజినెస్‌లో రకుల్ ప్రీత్‌కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో కాదు.. సౌత్‌లోనే లేరు. F 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే చాలా మంది కొవ్వు కరిగించింది రకుల్. అవకాశాలు వచ్చినా రాకపోయినా తనకు ఉన్న బిజినెస్ చూసుకుంటూ హాయిగా బతికేస్తుంది రకుల్. పనిలో పనిగా తన కొవ్వును కూడా ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూనే ఉంది ఈ భామ. తాజాగా మరో ఫిట్ నెస్ మంత్రతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రకుల్ ఫిట్ నెస్ చూసి ఏ ముద్దుగుమ్మకైనా కూడా కుళ్లు రావాల్సిందే. సినిమా సినిమాకు మరింత సన్నగా మారిపోయి అందరికీ షాక్ ఇస్తుంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం హిందీ, తమిళ్ భాషల్లో బిజీగా ఉంది రకుల్. తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నటిస్తుంది. ఈమెకు సినిమాలతో పాటు జిమ్ కూడా అంతే ఇష్టం. అందుకే ఇటు ఇండస్ట్రీతో పాటు బిజినెస్‌పై కూడా ఫోకస్ పెడుతుంది రకుల్ ప్రీత్ సింగ్. ఎప్పటికప్పుడు తన జిమ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా బరువులు ఎత్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రకుల్. అది చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. తన జిమ్, యోగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. వీటితో కావాల్సినంత హాట్ నెస్ పెంచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా సినిమాలు ఉన్నా లేకపోయినా రకుల్ మాత్రం హాయిగా బతికేస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: April 11, 2020, 4:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading