Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: September 24, 2020, 5:55 PM IST
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
నాకు ఎలాంటి సమన్లు అందలేదు.. హైదరాబాద్కు కానీ ముంబైలో కానీ నన్నెవరు పిలవలేదు.. ఇవే మాటలు కొన్ని గంటల కింద రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది. రకుల్ ప్రీత్ సింగ్ సహా సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లకు కూడా ఎన్సిబీ సమన్లు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అవి నిజమే అని తర్వాత కూడా తేలిపోయింది. వీళ్లను విచారణకు రమ్మంటూ పిలిచారు కూడా. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు కాస్తా ఇప్పుడు అనేక మలుపులు తిరిగి తిరిగి చివరికి డ్రగ్స్ వ్యవహారం దగ్గర వచ్చి ఆగింది. మరీ ముఖ్యంగా రియా చక్రవర్తిని విచారించిన తర్వాత చాలా సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
అందులోనే రకుల్ పేరు కూడా బయటికి వచ్చింది. దాంతో ఈమెకు కూడా సమన్లు జారీ చేసారు అధికారులు. కానీ రకుల్ మాత్రం తనకు అలాంటి సమన్లు అందలేదని చెప్పి షాక్ ఇచ్చింది. అయితే అలా చెప్పిన కొన్ని గంటలకే మాట మార్చేసింది ఈ ముద్దుగుమ్మ. తనకు నార్కోటిక్స్ అధికారుల నుంచి సమన్లు అందాయని.. సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ ముందు సెప్టెంబర్ 25న విచారణకు వెళ్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇదే కేసులో దీపిక పదుకొనేకు కూడా సమన్లు అందాయి. ఆమెను కూడా సెప్టెంబర్ 25నే ప్రశ్నించనున్నారు అధికారులు.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
గత వారం రోజులుగా ఈమె గోవాలో ఓ వర్క్ కోసం వెళ్లింది. విచారణకు ముందు రోజు ముంబైకు వస్తానని అధికారులకు సమాచారం అందించింది దీపిక పదుకొనే. రకుల్ ప్రీత్, దీపికతో పాటు శ్రద్ధా కపూర్, సారాను కూడా విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు. ఫ్యాషన్ డిజైనర్ సైమన్ ఖంబట్టా ఇప్పటికే విచారణకు వచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ శృతి మోదీ తర్వాత సైమన్ను విచారించారు నార్కోటిక్స్ అధికారులు. ఇక రకుల్ కూడా మరికొన్ని గంటల్లో అధికారుల ముందుకు రాబోతుంది. మరి అక్కడ ఇంకెన్ని సంచలన విషయాలు బయటికి వస్తాయనేది చూడాలి.
Published by:
Praveen Kumar Vadla
First published:
September 24, 2020, 5:55 PM IST