RAKUL PREET SINGH OPEN COMMENTS ON HER RELATION WITH JACKKY BHAGNANI SLB
మనసుకు ప్రశాంతత ముఖ్యం.. అందుకే ఆ ఎఫైర్ బయటపెట్టా..! రకుల్ ప్రీత్ ఓపెన్ కామెంట్స్
Twitter Photo
Rakul Preet Singh Lover: నిజానిజాలు పక్కనబెడితే హీరోయిన్ల ప్రేమ ముచ్చట్లను ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు జనం. అయితే ఇలాంటివి తనకు పెద్దగా నచ్చవని అంటున్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. వీటినుంచి దూరంగా ఉండేందుకే ప్రియుడి విషయాన్ని బయటపెట్టాలని అంటోంది.
సినీ తారలకు లవ్ ఎఫైర్స్ అనేవి కామన్. హీరోహీరోయిన్ల ప్రేమ విషయాలపై ఎప్పుడూ ఎదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. మీడియా వర్గాలు ఎక్కువగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్నే టార్గెట్ చేస్తుంటాయి. యంగ్ యాక్టర్స్ ప్రతి కదలికను గమనిస్తూ కెమెరా లెన్స్‌తో గురిపెడుతుంటాయి. అందుకే యువ తారల లవ్ ఎఫైర్స్ తాలూకు ఫొటోలతో పాటు ఎన్నో గాసిప్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. నిజానిజాలు పక్కనబెడితే హీరోయిన్ల ప్రేమ ముచ్చట్లను ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటివి తనకు పెద్దగా నచ్చవని అంటున్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. వీటినుంచి దూరంగా ఉండేందుకే ప్రియుడి విషయాన్ని బయటపెట్టాలని అంటోంది. తన బంధాన్ని సీక్రెట్‌గా ఉంచొద్దని దానివల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని చెబుతోంది.
ప్రస్తుతం జాకీ భగ్నానీ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది రకుల్ ప్రీత్ సింగ్. గతేడాది తన పుట్టినరోజు సందర్భంగా ప్రియుడు జాకీని అందరికీ పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు ప్రియుడితో దిగిన పిక్స్, ఎంజాయ్ మూమెంట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటోంది. దీంతో రకుల్ ఫ్యాన్స్ ఈ ఇద్దరి బంధం మూడు మూళ్ళ బంధంగా ఎప్పుడు మారుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఓ వైపు లవ్ ఎఫైర్ నడిపిస్తూనే తన కెరీర్ పరంగా దూసుకుపోతోంది రకుల్ ప్రీత్. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించి ఇప్పుడు బాలీవుడ్ తెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె తన లవ్ ఎఫైర్ విషయమై రియాక్ట్ అయింది. తన ప్రేమ విషయాన్ని దాచుకోవాలని అనుకోవడం లేదని, దాన్ని గోప్యంగా ఉంచడం వల్ల అనేక రకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది. దీంతో ప్రశాంతత కోల్పోతాం. కాబట్టి అలా తాను న్యూస్ కాకూడదు అనుకొనే రిలేషన్లో ఉన్న విషయాన్ని దాచుకోకుండా బయటకు చెప్పేశానని రకుల్ చెప్పుకొచ్చింది.
అలాగే మన జీవితంలో తల్లిదండ్రులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఎలా అయితే ఉంటారో.. వ్యక్తిగత జీవితంలో కూడా మనకంటూ ఓ వ్యక్తి ఉంటాడని.. తనకు ఆ వ్యక్తి జాకీ అని రకుల్ తెలిపింది. మొదట స్నేహితులుగా ఉన్న తాము అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని చెబుతూ రకుల్ ఓపెన్ అయింది. నటీనటుల పర్సనల్ విషయాల కంటే ప్రొఫెషనల్ విషయాలు జనాలు చర్చించుకుంటే తనకిష్టమని రకుల్ పేర్కొంది. ప్రస్తుతం పలు హిందీ, తమిళ సినిమాతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తెలుగులో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.