ఇతనే నా జతకాడు.. పెద్ద గిఫ్ట్ -Jackky Bhagnaniతో పెళ్లిపై Rakul Preet Singh అధికారిక ప్రకటన

జాకీ భగ్నానీతో రిలేషన్ పై రకుల్ ప్రీత్ క్లారిటీ

Rakul Preet Singh With Jackky Bhagnani | టాప్ హీరోయిన్ రకుంల్ ప్రీత్ సింగ్ తన జతగాడిని అభిమానులకు పరిచయం చేశారు. గుసగుసలకు చెక్ పెడుతూ జాకీ భగ్నానీనే తాను ప్రేమిస్తున్నట్లు, అతనితోనే రిలేషన్ లో ఉన్నట్లు రకుల్ అధికారికంగా చెప్పారు. పుట్టినరోజు నాడే రకుల్ ఈ ప్రకటన చేయడం విశేషం..

 • Share this:
  సమంత-నాగచైతన్య విడాకుల ఉదంతంతో చిన్నపాటి విషాదంలో మునిగిపోయిన తెలుగు సినీ అభిమానులకు క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శుభవార్త చెప్పింది. తన పుట్టినరోజు నాడే పెళ్లిపై అధికారిక ప్రకటన చేసింది. కొన్నాళ్లుగా సాగుతోన్న గుసగుసలనే నిజం చేస్తూ తన లవర్ పేరును ప్రకటించడమేకాదు, ఇకపై కలిసికట్టుగా జీవితాన్ని సాగించబోతున్నట్లు చెప్పేసింది..

  టాలీవుడ్ సహా బాలీవుడ్, కోలీవుడ్ లో రాణించి, తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆదివారంతో 31వ పడిలోకి ప్రవేశించారు. బర్త్ డే సందర్భంగా విశెష్ చెబుతోన్న అభిమానులకు ఆమెనే రివర్సులో గుడ్ న్యూస్ వెల్లడించారు. తాను ప్రేమిస్తోన్న.. కలిసుంటోన్న.. త్వరలోనే పెళ్లాడబోతోన్న వ్యక్తిని రకుల్ పరిచయం చేశారు.

  బాలీవుడ్ యువ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో రిలేషన్ లో ఉన్నట్లు రకుల్ ప్రీత్ వెల్లడించారు. జాకీ భగ్ననీ ‘లవ్ ఆఫ్ మై లైఫ్’అని సంబోధిస్తూ రకుల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఏడాది పుట్టినరోజుకు అతనే పెద్ద గిఫ్ట్ అని, రాబోయే రోజుల్లో అన్నీ కలిసి పంచుకుంటామని చెప్పారు..

  ‘జాకీ భగ్నానీ... థాంక్యూ మై లవ్. ఈ ఏడాది నా అతిపెద్ద గిఫ్ట్ నువ్వే. నా జీవితానికి కొత్త రంగులు అద్దావ్.. నన్ను సదా నవ్వించావ్.. థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్.. నీలా నువ్వు ఉన్నందుకు కూడా థాంక్యూ. ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో జ్ఞాపకాలు పోగేసుకుందాం..’ అంటూ జాకీతో గడిపిన క్షణాలను, ఇద్దరూ కలిసున్న ఫొటోను రకుల్ షేర్ చేశారు.

  టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరుపొందిన రకుల్ ప్రీత్ ఇటీవల డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కోవడం, తెలంగాణ రాజకీయ నేతల నోటి వెంట కూడా ఆమె పేరు పలుమార్లు రిపీట్ కావడం తెలిసిందే. వివాదాల సంగతి ఎలా ఉన్నా, రిలేషన్ పై అధికారిక ప్రకటన చేసిన రకుల్ ప్రీత్ కు తోటి సెలబ్రిటీలు, అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
  Published by:Madhu Kota
  First published: