Rakul Preet Singh : రకుల్ ప్రీత్.. తెలుగులో ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. ఈ భామ ఇటూ తెలుగు సినిమాలు చేస్తూనే అటూ హిందీ, తమిళ సినిమాల్లోను నటిస్తోంది. తెలుగు తెరకు ‘కెరటం’ అనే సినిమాతో పరిచయమైన రకుల్, సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో మొదటి హిట్ అందుకుని తెలుగు వారికి దగ్గరైంది. ఈ తర్వాత నుండి తన అంద చందాలతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొడుతోంది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఎప్పుడూ సమయం అనుకూలంగా ఉందదు కదా.. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ సినిమా అక్కడ మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో అవకాశాలు జోరుగా వస్తాయనుకుంటే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. కాగ ఈ మధ్య మరీ సన్నగా మారింది. దీంతో ముఖం ఇంతకు ముందువలే ఆకర్షణీయంగా కనిపించట్లేదంటున్నారు ఆమె అభిమానులు. అంతేకాకుండ మరోవైపు అందోళన చెందుతున్నారు. ఎందుకు మా అభిమాన నటి ఇంత బక్క చిక్కిపోతోందని తెగ బాధ పడుతున్నారు. అది అలా ఉంటే రకుల్ ఫిట్నెస్ బిజినెస్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ భామ సినీ కెరీర్ ప్రస్తుతం కొంత స్లోగా వున్న తన బిజినెస్‌లో మాత్రం అదరగొడుతోంది.
రకుల్ ప్రీత్ హాట్ పిక్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.