Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్‌లో ఈ టాలెంట్‌ కూడా ఉందా.. ఆశ్యర్యపోతున్న నెటిజన్స్..

Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్.. ఈ టాలెంట్ చూసి నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: October 27, 2020, 10:51 PM IST
Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్‌లో ఈ టాలెంట్‌ కూడా ఉందా.. ఆశ్యర్యపోతున్న నెటిజన్స్..
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
  • Share this:
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్.. ఈ టాలెంట్ చూసి నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సరైన సక్సెస్ లేని ఈ భామ.. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రంలో కథానాయికగా నటించింది. ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ రీసెంట్‌గా కంప్లీట్ కూడా అయింది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కరోనా సమయంలో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసిన హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు దర్శకుడిగా క్రిష్, హీరోగా వైష్ణవ్ తేజ్ కూడా రికార్డులకు ఎక్కారనే చెప్పాలి.  అయితే.. ఒకపుడు వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటించి వరుస సక్సెస్‌లు అందుకున్న రకుల్ ప్రీత్.. సింగ్ గత కొంత కాలంగా హిట్ అన్నదే ఎండమావి అయింది. అంతేకాదు ఎంతో ఆశతో హిందీలో అడుగుపెట్టిన అక్కడ కూడా ఈ భామకు నిరాశే ఎదురైంది. మరోవైపు ఇండస్ట్రీలో కొత్త భామలు అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే, రష్మికల రాకతో రకుల్ వంటి భామలకు కాస్తంత క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. అందుకే ఈ  భామ.. రోజురోజుకీ తన అందాల డోస్ పెంచేస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh/Instagram)


కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తుంటే కచ్చితంగా తన ఉనికి కాపాడుకోవాలంటే ఈ మాత్రం అందాలు ఆరబోయకపోతే తప్పదేమో అనుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రకుల్ పాత ఫోటోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానులు కూడా పండ‌గ చేసుకుంటున్నారు. బ్యాక్ లెస్ పోజులిచ్చి సెగలు రేపుతుంది రకుల్ ప్రీత్ సింగ్. అంతేకాదు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తాను హిందీలో పాడిన ఓ పాటను పోస్ట్  చేసింది.



ఈ పాటను ప్రొఫెషనల్ సింగర్‌లా పాడి ఆకట్టుకుంది. దాదాపు చాలా చోట్ల గుక్క తిప్పుకోకుండా రకుల్ పాడిన  ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఒకటి అరా చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో NCB ఎదుట హాజరైంది. దీంతో రకుల్ మెడకు కొత్త సమస్య చుట్టుకున్నట్టైంది. మరోవైపు ఈ భామ మనసు పెళ్లిపై మళ్లినట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా తనకు కాబోయే  వాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది కూడా చెప్పుకొచ్చింది రకుల్. అతడు తన కంటే చాలా పొడగరి అయివుండాలని కండీషన్ పెట్టింది రకుల్. దానికి కారణం కూడా చెప్పింది. కాబోయే వాడు ఎంత పొడుగ్గా ఉంటే తనను అంత తల ఎత్తుకునేలా చేస్తాడని చెప్తుంది రకుల్. హైహీల్స్ వేసుకున్నా కూడా అతనే పొడుగ్గా ఉండాలి.. దాంతో పాటు తెలివైన వాడై ఉండాలని కాబోయే భర్తకు కావాల్సిన లక్షణాలను చెప్పింది రకుల్. మొత్తంగా
Published by: Kiran Kumar Thanjavur
First published: October 27, 2020, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading