‘కెరటం’ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). తనదైన అంద చందాలతో అట్రాక్ట్ చేస్తూ వరుస ఆఫర్స్ పట్టేసింది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ యువత మనసు దోచుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కీర్తించబడుతూనే ఇతర దక్షిణాది భాషల్లోనూ సత్తా చాటుతోంది. ఇక బాలీవుడ్ (Bollywood) తెరపై కూడా తన మార్క్ చూపించింది రకుల్ ప్రీత్ సింగ్. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్ లో ఉండటం రకుల్ నైజం. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన డాన్స్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
వరల్డ్ నంబర్ 1 ట్రెండింగ్ సాంగ్ పసూరి (Pasoori)కి స్టెప్పులేసి అదరగొట్టింది రకుల్ ప్రీత్ సింగ్. బ్లాక్ డ్రెస్ వేసి గ్లామరస్ లుక్‌లో అదిరిపోయే స్టెప్పులేసింది. ప్రస్తుతం నాకు ఇష్టమైన పాట, ఉత్తమమైనదిగా చేసిన సెలబ్రిటీ డ్యాన్స్ కోచ్ డింపుల్ కొటేచా (dimplekotecha)కు ధన్యవాదాలు అంటూ ఈ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది రకుల్ ప్రీత్. దీంతో ఈ డ్యాన్స్ వీడియో ఆన్ లైన్ మాధ్యమాలపై వైరల్ అయింది. ఈ వీడియో చూసి రకుల్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. వావ్! అదుర్స్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఈ డాన్స్ వీడియోను చూసిన మంచు లక్ష్మి వెంటనే రియాక్ట్ అయ్యింది. చంపేశావ్ పో.. అన్నట్లుగా ఆమె పెట్టిన కామెంట్ రకుల్ పోస్టులో మెయిన్ హైలైట్ అయింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు జాకీ భగ్నానీ కూడా ఈ ఎనర్జిటిక్ డాన్స్ వీడియోపై రియాక్ట్ అయ్యాడు. 'మై డియర్ లవ్.. నాక్కూడా నేర్పించవా?' అంటూ స్వీట్ కామెంట్ వదిలాడు.
View this post on Instagram
రీసెంట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన అటాక్, రన్ వే 34 చిత్రాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక పోయాయి. ఆమె నటించిన తాజా సినిమాలు ఛత్రివాలి, మిషన్ సిండ్రెల్లా, థ్యాంక్ గాడ్ విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం అంతగా రుచించడం లేదు. తెలుగు చిత్రసీమలో రకుల్‌కి చెప్పుకోదగిన ఆఫర్స్ అయితే రావడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.