నాజూకు బ్యూటీ రకుల్ ప్రీత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా హిట్టయ్యిందా.. ఫట్టయ్యిందా అనేది పక్కనెట్టేసి తన దగ్గరికి కథ వచ్చిందంటే చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ నటిస్తుంటుంది. సినిమాలున్నా.. లేకున్నా సరే తన ఫిజిక్‌ను మాత్రం బాగానే మెయింటైన్ చేస్తుంటుంది. అందుకే ఇండస్ట్రీలోకి అడుగెట్టినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ ఈ బ్యూటీ అలానే ఉంది. నిత్యం కసరత్తులు చేస్తుండటంతో.. వయసు పెరుగుతున్నప్పటికీ అస్సలు కనపడదు. ఇప్పటి వరకూ యోగాలు, జిమ్‌లకే సమయం కేటాయిస్తూ వస్తున్న రకుల్ ఇప్పుడు బాక్సింగ్గా నేర్చేసుకుంటోంది.
తాజాగా.. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫిట్నెస్ ట్రైనర్‌తో కలిసి బాక్సింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. కాళ్లతో ఒకసారి.. ఇంకోసారి చేతులతో పంచింగ్ చేస్తూ రకుల్ వర్కవుట్ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియోను చూస్తే నిజంగా అందాల భామ తన ఫిజిక్‌పై ఎంత దృష్టిపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని చూసిన అభిమానులు, నెటిజన్లంతా బాబోయ్.. రకుల్ బాక్సింగ్ ప్రాక్టీస్ మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక లైక్‌ల గురించి అయితే ప్రత్యేకించి చెప్పకర్లేదు.. ఆ రేంజ్లో లైక్‌ల వర్షం కురుస్తోంది. ఈ ఒక్క వీడియోకే కాదు.. రకుల్ తన ఇన్‌స్టాలో చిన్న పిక్ పెట్టినా సరే లైక్‌లు, షేర్ల వర్షం కురుస్తుంటుంది.
View this post on Instagram
కాగా.. రకుల్ ప్రస్తుతం ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న ఈ భామ స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా తనదైన శైలిలో నటిస్తూ దున్నేస్తోంది. ఇవన్నీ ఓ ఎత్తయితే.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా రకుల్ గడిపేస్తోందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుగులో ఈ మధ్యే రిలీజ్ అయిన నితిన్ ‘చెక్’ మూవీలో లాయర్‌గా ప్రత్యేక పాత్రలో చేసిన రకుల్.. మళ్లీ హీరోయిన్గా అందాలు ఆరబోస్తుందా..? అని అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rakul Preet Singh