కరోనా కారణంగా చాలా రోజులుగా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరూ ఇళ్లు దాటి బయటికి రావడం లేదు. సినిమా వాళ్లైతే మరీనూ.. వాళ్లు అసలు షూటింగ్స్ కూడా బంద్ చేసి ఇంట్లోనే కూర్చున్నారు. పర్మిషన్స్ ఇచ్చినా కూడా అడుగు బయట పెట్టడానికి మనసు ఒప్పుకోవడం లేదు. అయితే కొందరు మాత్రం ధైర్యం చేసి బయటికి వచ్చేసారు. అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. క్రిష్ దర్శకత్వంలో ఈమె ఓ సినిమా చేస్తుంది.
క్రిష్ వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ (rakul vashnav tej krish)
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇందులో హీరో. ఈయన తొలి సినిమా ఉప్పెన ఇంకా విడుదల కాకముందే అప్పుడే రెండో సినిమా చేస్తున్నాడు ఈయన. అది కూడా క్రిష్ లాంటి దర్శకుడితో. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. హీరో హీరోయిన్లు ఇద్దరూ షూట్లో పాల్గొన్నారని తెలుస్తుంది.
క్రిష్ వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ (rakul vashnav tej krish)
వికారాబాద్ అడవిలో ఈ చిత్ర షూట్ జరుగుతుంది. ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయనున్నాడు క్రిష్. దీనికోసం 40 రోజుల సింగిల్ షెడ్యూల్ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఈయనకు పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉంది. అది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. అందుకే ఈ గ్యాప్‌లో వైష్ణవ్ తేజ్ సినిమాను పూర్తి చేయాలని ఫిక్సయ్యాడు క్రిష్.
క్రిష్ వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ (rakul vashnav tej krish)
ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుంటే.. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి ఎంతమంది హీరోయిన్లు ఇంట్లోనే ఉన్నా.. రకుల్ మాత్రం ధైర్యంగా అడుగు బయట పెట్టేసింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.