Rakul Preet Singh : వరుస సినిమాలతో అదరగొడుతోన్న రకుల్ తెలుగులో ‘కెరటం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టకోలేకపోవడంతో పెద్దగా గుర్తింపుగా రాలేదు. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాందీ దర్శకత్వంలో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకుంది రకుల్. ఇక ఆ తర్వాత నుంచి.. తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కాగా ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ భామ ప్రస్తుతం ఏడు సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది. ప్రస్తుతం రకుల్ చేస్తోన్న సినిమాల విషయానికి వస్తే...ఈ భామ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాకు కొండ పొలం అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు రకుల్ తెలుగులో నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తోన్న చెక్ అనే సినిమా చేస్తోంది. వీటితో పాటు రకుల్ హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. అర్జున్ కపూర్‌తో `సర్దార్ అండ్ గ్రాండ్ సన్`, జన్ అబ్రహంతో `ఎటాక్`, అజయ్ దేవ్‌గణ్ మేడే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు హీరో అజయ్ దేవ్గన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తరువాత సీనియర్ స్టార్ అమితాబ్, అజయ్‌లు కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాలో రకుల్.. అజయ్‌కు కో పైలట్ పాత్రలో నటిస్తుంది. ఇక తమిళంలో కమల్ హాసన్ ‘భారతీయుడు 2’, హీరో శివకార్తికేయన్ ‘అయాలన్’, సినిమాలు చేస్తోంది. ఇలా దాదాపు రకుల్ చేతిలో ప్రస్తుతం ఓ ఏడు సినిమాలున్నాయి.
అది అలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రకుల్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. అంతేకాదు త్వరలోనే షూటింగ్లో పాల్గొంటాను. అయితే నన్ను ఈ మధ్య కాలంలో కలిసిన వారందరూ చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.. అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది రకుల్. ఇక ఆ మధ్య రకుల్ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పింది. రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం ఉందని, తనకు కాబోయే భర్తకు ఈ జీవితం పట్ల కచ్చితమైన స్పష్టత, అభిరుచి ఉండాలని చెప్పింది. తాను సంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం నుంచి వచ్చానని.. తన తండ్రి ఆర్మీలో ఉద్యోగం చేయడంతో అదే వాతావరణంలోనే పెరిగానని తనకు క్రమశిక్షణ కొంత ఎక్కువ అని పేర్కోంది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే సంతోషిస్తానని తెలిపింది. తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే తన పెళ్లి జరగాలని ఆశిస్తున్నానని అంతేకాదు బీచ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది రకుల్.
Published by:Suresh Rachamalla
First published:December 28, 2020, 16:35 IST