Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. దక్షిణాదిలో టాప్ స్టార్.. ఉత్తరాదిలో బిజీ స్టార్ గా సత్తా చూపెడుతూనే ఉంది. 2021లో కూడా ఈ భామ డైరీ ఫుల్లు బిజీగా ఉంది. గలగలా నవ్వుతూ, చక్కగా తెలుగులో మాట్లాడే రకుల్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ కూల్ గర్ల్. సోషల్ మీడియాలో హుషారుగా ఉండే రకుల్ తన ప్యాషన్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేసుకుంటూ, ఫాలోయర్స్ లో ఉత్సాహం నింపుతున్నారు. ఉద్యోగులకే కాదు స్టార్స్ కు కూడా మండే బ్లూస్ ఉంటాయని, వాటిని ఇలా పారద్రోలానంటూ ఆమె చేసిన ఫ్రెష్ పోస్ట్ ఆసక్తిగా ఉంది.
కన్నుమీటుతూ ఉన్న తన ఫోటో పోస్ట్ చేసిన ర"కూల్" స్టార్ గా ఆమె మండే బ్లూస్ ను పారద్రోలుతున్నట్టు పేర్కొంది.ఈమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఈ పోస్ట్ చేసిందో లేదో.. 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
పెట్ ఫుడ్ డ్రూల్స్ (Drools) అంటూ 17వ తేదీన ఆమె పోస్ట్ చేసిన మరో పిక్ కు 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయంటే రకుల్ ఫాలోయర్స్ ఆమె పోస్టులను ఎంతలా మెచ్చుకుంటున్నారో అర్థమవుతుంది. నాణ్యమైన ఆహారం, న్యూట్రిషియస్ ఫుడ్ కే ప్రాధాన్యం ఇచ్చే ఫుడీగా రకుల్ తన ఫాలోయర్లను విపరీతంగా ప్రభావితం చేసే సెలబ్రిటీగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. కొంతకాలం క్రితమే తాను వేగన్ (vegan) గా మారినట్టు సోషల్ మీడియాలో చెప్పిన రకుల్ చాలా మందికి వేగన్ ఫుడ్ పై అవగాహన కల్పిస్తున్నారు.
ఫిట్నెస్ ఫ్రీక్ (Fitness freak) అయిన రకుల్ సైక్లింగ్ చేస్తున్న వీడియోను 5 రోజుల క్రితం పోస్ట్ చేస్తే 4 లక్షలమందికి పైగా ఆమె ఫాలోయర్లు దీన్ని విపరీతంగా లైక్ చేసి.. షేర్ చేశారు. అందుకే ఈమెను వర్కవుట్ మోటివేషన్ క్వీన్ గా ఫ్యాన్స్ పిలుచుకుంటారు. 12 కిలోమీటర్లు అలవోకగా సైక్లింగ్ చేసి అభిమానుల చేత రకుల్ వావ్ అనిపించుకున్నారు.
కరోనా (Corona) బారిన పడిన తాను రీకవర్ అయినట్టు, పోస్ట్ రీకవరింగ్ విషయాలపై అవగాహన కల్పించేలా పోస్టులను చేసి తన ఫాలోయర్లను ఆమె ఆకట్టుకుంటున్నారు.
ఎంత బిజీగా ఉన్నా తన ఫోటో షూట్స్ ను చాలా ఇష్టంగా చేసే రకుల్ వాటిని క్రమం తప్పకుండా షేర్ చేస్తూ ఉంటారు. ఫిలిం ఫేర్ (Filmfare) మ్యాగజైన్ కవర్ స్టోరీ పిక్ ను షేర్ చేసి తనలోని స్టైల్ కోషంట్ ను మరోమారు పరిచయం చేశారు రకుల్.
మొత్తంగా 2021లో నైనా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కలిసొస్తుందా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 18, 2021, 13:36 IST