లైంగిక వేధింపులపై రకుల్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లంతా తేడాగాళ్లు..

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చింది కానీ ప్రేక్షకులకు మాత్రం కాదు. ఇప్పటికీ ఈమె ఇక్కడే ఉంటుంది. ఏ కార్యక్రమం జరిగినా కూడా వెంటనే ఇక్కడ వాలిపోతుంది రకుల్. అలాగే ఇప్పుడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 25, 2019, 5:51 PM IST
లైంగిక వేధింపులపై రకుల్ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లంతా తేడాగాళ్లు..
సినీనటి రకుల్ ప్రీత్ సింగ్
  • Share this:
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చింది కానీ ప్రేక్షకులకు మాత్రం కాదు. ఇప్పటికీ ఈమె ఇక్కడే ఉంటుంది. ఏ కార్యక్రమం జరిగినా కూడా వెంటనే ఇక్కడ వాలిపోతుంది రకుల్. అలాగే ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఓ కార్యక్రమానికి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది రకుల్. ముఖ్యంగా చిన్న పిల్లలపై జరిగే లైంగిక వేధింపులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ భామ. చిన్నవయసు నుంచే అమ్మాయిలకు లైంగిక వేధింపుల పట్ల చైతన్యం వచ్చేలా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని.. అందులో వాళ్లు చురుగ్గా వ్యవహరించాలని చెబుతుంది రకుల్ ప్రీత్ సింగ్. వైజాగ్‌లో నిర్వహించిన 555కే 2.0 వాక్ ముగింపు కార్యక్రమంలో ఈ ముద్దుగమ్మ పాల్గొంది.
Rakul Preet Singh interesting comments who harassed sexually girls in childhood pk రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చింది కానీ ప్రేక్షకులకు మాత్రం కాదు. ఇప్పటికీ ఈమె ఇక్కడే ఉంటుంది. ఏ కార్యక్రమం జరిగినా కూడా వెంటనే ఇక్కడ వాలిపోతుంది రకుల్. అలాగే ఇప్పుడు.. sexually harassed,rakul preet singh,rakul preet singh twitter,rakul preet singh instagram,rakul preet singh sexually harassed,rakul preet singh movies,rakul preet singh hot,rakul preet singh photos,rakul preet singh hot photos,rakul preet singh comments on sexual harassment,telugu cinema,రకుల్ ప్రీత్ సింగ్,రకుల్ ప్రీత్ సింగ్ సెక్సువల్ హెరాజ్‌మెంట్,రకుల్ లైంగిక వేధింపులు,తెలుగు సినిమా
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోషూట్

అక్కడే కొన్ని విషయాలు చెప్పింది. ముఖ్యంగా చెడు స్పర్శకు.. మంచి స్పర్శకు మధ్య తేడా ఏంటో చిన్నతనంలోనే అమ్మాయిలకు అవగాహన కల్పించడం ఇప్పుడున్న రోజుల్లో చాలా కీలకమని చెబుతుంది ఈ బ్యూటీ. ఇప్పటి సమాజంలో అమ్మాయిలను అసభ్యకరమైన రీతిలో తాకేవాళ్లు ఎక్కువ అవుతున్నారని వాపోయింది రకుల్. అలా చేసేవాళ్లు ఆ విధంగా తాకేవాళ్లు తేడాగాళ్లే అంటుంది రకుల్. అలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీలో వరస సినిమాలు చేస్తుంది. ఇక తెలుగులో నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నటిస్తుంది.
First published: November 25, 2019, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading