RAKUL PREET SINGH INTERACTS WITH MEDIA SHARES SOME INTERESTING FACTS ABOUT HER LIFE SR
Rakul Preet Singh : నా వ్యాపారం మూత పడిన ఉద్యోగులకు జీతాలు ఆపలేదు : రకుల్ ప్రీత్..
Rakul preet Photo : Instagram
Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది.
Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవల బాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. అది అలా ఉంటే తాజాగా రకుల్ నితిన్ చెక్ సినిమాలో నటించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గురించి మాట్లాడుతూ..ఆయన గతంలో చేసిన రెండు సినిమాల్ని నేను చూశాను. ఇక ఆయన్నుంచి ఫోన్ రాగానే ఖచ్చితంగా నా పాత్ర కొత్త రకంగా ఉంటుందని అనుకున్నానని చెప్పింది. ‘చెక్’ కథ నచ్చడం మిగతా విషయాలేవీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను అని తెలిపింది. సినిమా చూసిన వారు లాయర్ మానస పాత్రలో నా నటన చాలా బాగుందని అంటున్నారు.
రకుల్ ఇంకా మాట్లాడుతూ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్‌తో వస్తోన్న సినిమా గురించి మాట్లాడింది. ఆ సినిమాలో తన పాత్ర ఇంకా కొత్తగా ఉంటుందని తెలిపింది. ఈ సినిమా కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో రకుల్ డి గ్లామర్ పాత్రలో కనిపించనుందట. ఇక తన వ్యాపారం గురించి మాట్లాడిన రకుల్.. లాక్డౌన్ ప్రభావం నా జిమ్ వ్యాపారంపై బాగానే పడింది. అయితే కరోనా కారణంగా కొన్నాళ్ల పాటు జిమ్‌లు మూతపడినా అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగులకి జీతాలు మాత్రం ఆపలేదని తెలిపింది. కాగా ప్రస్తుతం మాత్రం మళ్లీ జిమ్ వ్యాపారం ఊపందుకుందని తెలిపింది రకుల్..
ఇక హిందీ సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. 'మేడే' పేరుతో వస్తోన్న ఈ చిత్రానికి స్టార్ హీరో అజయ్ దేవ్గన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తరువాత సీనియర్ స్టార్ అమితాబ్, అజయ్‌లు కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2లో సినిమాలో నటిస్తోంది. ఇక రకుల్ అర్జున్ కపూర్‌తో చేస్తున్న సర్దార్ కా గ్రాండ్ సన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా స్ట్రీమ్ కానుంది.